Palnadu Accident: ఆ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన సీఎం జగన్
పల్నాడు జిల్లా చిలకలూరిపేట వద్ద బస్సు ప్రమాదంలో ఆరుగురు మరణించిన ఘటనపై

పల్నాడు జిల్లా చిలకలూరిపేట వద్ద బస్సు ప్రమాదంలో ఆరుగురు మరణించిన ఘటనపై
పల్నాడు జిల్లా చిలకలూరిపేట వద్ద బస్సు ప్రమాదంలో ఆరుగురు మరణించిన ఘటనపై ముఖ్యమంత్రి వైయస్.జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. మరణించిన వారి కుటుంబాలకు ఆయన సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. చిలకలూరి పేట సమీపంలోని పసుమర్రులో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు – టిప్పర్ లారీ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 42 మంది ఉన్నారు. మృతుల్లో లారీ డ్రైవర్, మరో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను అంజి (35), ఉప్పుగుండూరు కాశీ(65), ఉప్పుగుండూరు లక్ష్మి (55), ముప్పరాజు ఖ్యాతిసాయిశ్రీ (8)గా గుర్తించారు. గాయపడిన వారికి చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం మరింత మెరుగైన చికిత్స కోసం గుంటూరుకు తరలించారు.
