ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు కుప్పంలో పర్యటించనున్నారు. ఆయన కుప్పంకు నీళ్లు అందించబోతున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు కుప్పంలో పర్యటించనున్నారు. ఆయన కుప్పంకు నీళ్లు అందించబోతున్నారు. ఎన్నో ఏళ్లుగా నీళ్లు కావాలని అడుగుతూ ఉన్న కుప్పం ప్రజల ఆకాంక్షలను సీఎం జగన్ నేటితో తీర్చనున్నారు. కుప్పం ఎమ్మెల్యేగా, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చేయలేని పనిని వైఎస్ జగన్ చేసి చూపించబోతున్నారు. గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడుకు చాలా తక్కువ ఓట్లు రాగా.. ఇప్పుడు కుప్పంకు నీరు కూడా వైసీపీ ప్రభుత్వం అందిస్తూ ఉండడంతో టీడీపీలో టెన్షన్ కనిపిస్తూ ఉంది. వైఎస్‌ జగన్‌ సీఎం అయ్యాక కుప్పం నియోజకవర్గంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. కుప్పంను మున్సిపాల్టీని చేయడంతో పాటు దీని కేంద్రంగా రెవెన్యూ డివిజన్‌ను, పోలీసు సబ్‌ డివిజన్‌ను ఏర్పాటుచేశారు. రూ.66 కోట్లతో రోడ్లు, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేశారు. 2022, సెప్టెంబర్ లో 23న కుప్పంలో సీఎం జగన్‌ పర్యటించారు. కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ను పూర్తిచేసి.. కృష్ణా జలాలను అందించి సుభిక్షం చేస్తానని హామీ ఇచ్చారు. చెప్పినట్లుగానే ఆ పనులను 2023, డిసెంబరు 15 నాటికే పూర్తిచేయించారు. పుంగనూరు బ్రాంచ్‌ కెనాల్‌ నుంచి మూడు దశల్లో కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌కు కృష్ణా జలాలను ఎత్తిపోయడం 2023, డిసెంబర్‌ 18న ప్రారంభించారు.

కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌లో 68.466 కిమీ వద్ద క్రాస్‌ రెగ్యులేటర్‌ (రామకుప్పం మండలం రాజుపాలెం వద్ద) నుంచి మద్దికుంటచెరువు (2.91 ఎంసీఎఫ్‌టీ), నాగసముద్రం చెరువు (0.25 ఎంసీఎఫ్‌టీ), మనేంద్రం చెరువు (13.78 ఎంసీఎఫ్‌టీ), తొట్లచెరువు (33.02 ఎంసీఎప్‌టీ)లకు సోమవారం సీఎం జగన్‌ కృష్ణాజలాలను విడుదల చేయనున్నారు.

Updated On 25 Feb 2024 8:54 PM GMT
Yagnik

Yagnik

Next Story