CM Jagan: సీఎం జగన్ కుప్పం పర్యటన వివరాలివే!!
కుప్పం నియోజకవర్గంలోని 110 మైనర్ ఇరిగేషన్ చెరువుల ద్వారా 6,300 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుప్పం నియోజకవర్గంలో సోమవారం పర్యటించనున్నారు.ఉదయం 9.45 గంటలకు సీఎం తిరుపతి విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరి రాజుపేటకు చేరుకుంటారు.10.30 గంటలకు హంద్రీనీవా సుజల స్రవంతి నీటిని విడుదల చేసి, శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తారు. 11.05గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి శాంతిపురం మండలం గుండిశెట్టిపల్లెకు చేరుకుంటారు. ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించాక కొత్త చెరువుల శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తారు. 11.45 నుంచి మధ్యాహ్నం 1.10 వరకు బహిరంగసభలో పాల్గొంటారు.
కుప్పం నియోజకవర్గంలోని 110 మైనర్ ఇరిగేషన్ చెరువుల ద్వారా 6,300 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లోని 4.02 లక్షల జనాభాకు త్రాగు నీరు అందిస్తూ.. అనంత వెంకటరెడ్డి హంద్రీ-నీవా సుజల స్రవంతిలో భాగంగా రూ. 560.29 కోట్ల వ్యయంతో చేపట్టిన కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు పూర్తి చేసి, కుప్పం నియోజకవర్గానికి నేడు చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం రాజుపేట వద్ద కృష్ణా జలాలు విడుదల చేయనున్నారు.