Muslim Reservations: ముస్లిం మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు కొనసాగాల్సిందే: సీఎం జగన్
పెత్తందార్ల కూటమి అంతా పేద పిల్లలకు గవర్నమెంట్ బడుల్లో ఇంగ్లిష్ మీడియం చదువులు చెప్పిస్తుంటే తట్టుకోలేకపోతున్నారని
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెబుతున్న బీజేపీతో చంద్రబాబు కొనసాగుతున్నారని.. ముస్లిం మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు కొనసాగాల్సిందేనని సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఒక్క రిజర్వేషన్లే కాదు.. ఎన్‌ఆర్‌సీ, సీఏఏతో పాటు ఏ అంశమైనా ముస్లిం మైనార్టీల మనోభావాలకు, ఇజ్జత్, ఇమాన్‌కు అండగా నిలబడతామన్నారు సీఎం జగన్. 175 అసెంబ్లీ సీట్లకుగానూ 4 శాతం అంటే ఏడు అసెంబ్లీ సీట్లు ముస్లింలకు ఇచ్చి పొలిటికల్ రిజర్వేషన్లు కూడా తాము కల్పించామని గుర్తు చేశారు.
పెత్తందార్ల కూటమి అంతా పేద పిల్లలకు గవర్నమెంట్ బడుల్లో ఇంగ్లిష్ మీడియం చదువులు చెప్పిస్తుంటే తట్టుకోలేకపోతున్నారని సీఎం జగన్ ధ్వజమెత్తారు. పెత్తందారీ భావజాలం ఉన్న వాళ్లు ప్రజల ముందుకు వచ్చి ఓటు వేయమని అడుగుతున్నారు. ఈ రూపం మార్చుకున్న అంటరానితనం మీద మనం చేయాల్సిన యుద్ధం ఇంకా చాలా ఉంది. మరో నాలుగు రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇవి కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునేవి కావు. రాబోయే ఐదేళ్లూ ఇంటింటి అభివృద్ధి, పథకాల కొనసాగింపును నిర్ణయించే ఎన్నికలివని సీఎం జగన్ అన్నారు. జగన్‌కు ఓటేస్తే పథకాలన్నీ కొనసాగింపు, ఇంటింటి అభివృద్ధి జరుగుతుందని.. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నింటికీ ముగింపు, మళ్లీ మోసపోవడమేనన్నారు సీఎం జగన్.