YS Jagan Vs YS Jagan : వైఎస్‌ఆర్ వారసత్వం ఎవరిది? జగన్‌దా? షర్మిలదా?
దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి(YS Rajashekar reddy) వారసత్వం ఎవరికి దక్కుతుంది?
దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి(YS Rajashekar reddy) వారసత్వం ఎవరికి దక్కుతుంది? కొడుకు వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డికా?(YS Jagan) లేకపోతే మురుసుమల్లి షర్మిలకా?(YS Sharmila) ఇప్పుడిది చర్చనీయాంశమయ్యింది. ఓ వర్గం పనిగట్టుకుని షర్మిలను వైఎస్‌ఆర్ నిజమైన వారసురాలిగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్(Congress) నాయకులు అయితే షర్మిల భజన చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో షర్మిల నిర్వహించిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతి సభకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో(Revanth reddy) పాటు మంత్రులు, నాయకులు వెళ్లారు. వెళ్లినవారు వైఎస్‌ఆర్‌ను పొగుడుతూనే షర్మిలను ఆకాశానికేత్తేశారు. 2029లో ఆంధ్రప్రదేశ్‌కు షర్మిల ముఖ్యమంత్రి అవుతారట! ఈ మాటన్నది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. చంద్రబాబునాయకుడు(Chandrababu) ప్రియ శిష్యుడు రేవంత్ అన్న విషయం అందరికీ తెలుసు. ఆ మాటంటే ము ..మీద తంతానని రేవంత్ చెప్పినా ఇది కాదనలేని సత్యం. నిన్నటి సభలో మాత్రం తాను వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని చూసే రాజకీయాలు నేర్చుకున్నానని రేవంత్ చెప్పుకొచ్చారు. కొత్తమతం పుచ్చుకుంటే గుర్తులెక్కువ అంటారు. అలాగే ఒరిజినల్ కాంగ్రెస్ నాయకుల కంటే రేవంత్‌రెడ్డినే వైఎస్‌ఆర్ మీద అపారమైన భక్తిని చాటుకున్నారు. అసెంబ్లీలో జగన్మోహన్‌రెడ్డి అడుగుపెట్టరని, కడప లోక్‌సభ నుంచి పోటీ చేస్తారనే వార్త ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. జగన్ కోసం కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి రాజీనామా చేస్తారని, ఆ స్థానం నుంచి జగన్ పోటీ చేస్తారని, పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తల్లి విజయమ్మగానీ(Vijayamma), భార్య భారతి(YS Bharathi) కానీ పోటీ చేస్తారని అంటున్నారు. ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు. ఈ వార్తలు నిజమే అయిన పక్షంలో కడప(Kadapa) లోక్‌సభకు ఉప ఎన్నిక వస్తుంది. అప్పుడు మళ్లీ షర్మిలనే పోటీ చేస్తారు. ఈసారి మాత్రం తాను ఊరూరు , ఇళ్లిళ్లూ తిరిగి షర్మిల గెలుపు కోసం ప్రచారం చేస్తానని రేవంత్ అంటున్నారు. వైఎస్‌ఆర్ నిజమైన వారసురాలు షర్మిలనే అని చెప్పారు. అయిదేళ్ల తర్వాత ఏపీకి షర్మిలనే ముఖ్యమంత్రి అని జోస్యం చెప్పారు.
తెలంగాణ కాంగ్రెస్ నేతలు చెబుతున్నట్టు షర్మిలే వైఎస్‌ఆర్ వారసురాలా? అంటే అనుమానపడాల్సి ఉంటుంది. తెలంగాణలో సొంతంగా పార్టీ పెట్టి, బీఆర్ఎస్(BRS) నేతలను బండ బూతులు తిట్టి, పాదయాత్ర చేసి , అధికారంలోకి వద్దామనుకుని ఆశపెట్టుకున్నారు. కానీ తెలంగాణ రాజకీయాలలో అట్టర్‌ఫ్లాప్ అయ్యానని ఎన్నికల ముందు కానీ ఆమెకు అర్థం కాలేదు. వెంటనే కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తానని తెలిపారు. కాంగ్రెస్ ఈమెను పెద్దగా పట్టించుకోలేదు. దాంతో ఒంటరిగానే పోటీ చేస్తానంటూ పార్టీ సభ్యులతో కూడిన ఓ లిస్ట్‌ను కూడా ప్రకటించారు. మళ్లీ ఏమైందో ఏమో కానీ తాను ఎన్నికల బరి నుంచి తప్పుకున్నానని, బేషరతుగా కాంగ్రెస్‌కు సపోర్ట్ చేస్తున్నానని చెప్పారు. ఇందుకు కూడా కాంగ్రెస్ నుంచి పెద్దగా రియాక్షన్ రాలేదు. ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్‌కు షిప్ట్ అయ్యారు. అక్కడ కాంగ్రెస్ పార్టీకి షర్మిల అధినేత అయ్యారు. ఆ హోదాలోనే మీటింగ్‌లు పెట్టారు. ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆమె ఘన విజయం సాధించి ముఖ్యమంత్రి అవుతుందని రేవంత్‌రెడ్డి చెప్పారు. షర్మిలకు అంత సీనుందా? జనం ఆమెను వైఎస్‌ఆర్ వారసురాలిగా గుర్తిస్తున్నారా? టీ కాంగ్రెస్ నాయకులు తప్ప ఎవరూ అలా అనుకోవడం లేదు.