తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఆయన విదేశీ పర్యటన(International trip) ఖరారైంది. స్విట్జర్లాండ్‌లో(Switzerland) జరిగే దావోస్‌ ప్రపంచ ఆర్థిక సదస్సులో(Davos World Economic Forum) రేవంత్‌రెడ్డి తెలంగాణ ప్రతినిధిగా(Representative) పాల్గొనబోతున్నారు.

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఆయన విదేశీ పర్యటన(International trip) ఖరారైంది. స్విట్జర్లాండ్‌లో(Switzerland) జరిగే దావోస్‌ ప్రపంచ ఆర్థిక సదస్సులో(Davos World Economic Forum) రేవంత్‌రెడ్డి తెలంగాణ ప్రతినిధిగా(Representative) పాల్గొనబోతున్నారు. జనవరి 15-19న రేవంత్‌ స్విట్జర్లాండ్‌లో పాల్గొననున్నారు. ఆయన వెంట మంత్రి శ్రీధర్‌బాబు(Sridhar Babu), పరిశ్రమలశాఖ అధికారులు వెళ్లనున్నారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో పెట్టుబడులను ఆకర్షించి తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చేందుకు ఈ బృందం తమ వాదననను వినిపించనుంది.

దావోస్ సమావేశానికి ఏపీ సీఎం జగన్‌కు(CM Jagan) కూడా హాజరవుతారని తెలుస్తోంది. గతంలో కూడా సీఎం జగన్‌ దావోస్‌ సదస్సుకు హాజరయ్యారు. ఆ సమయంలో తెలంగాణ నుంచి ప్రతినిధిగా పాల్గొన్న కేటీఆర్‌, సీఎం జగన్‌ను అక్కడ కలిశారు. ఇప్పుడు ఈ సదస్సును కూడా ఉపయోగించుకోవాలని సీఎం జగన్‌ యోచిస్తున్నారని తెలుస్తోంది. ఎన్నికలకు ముందు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జగన్ భావిస్తున్నారట. దీంతో తొలిసారి రెండు తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులు స్విట్జర్‌లాండ్‌ వేదికగా కలవబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. రేవంత్, జగన్ ఇద్దరూ కొత్త ఏడాదిలో తొలిసారి కలిసే చోటు ఏంటంటే అది స్విట్జర్లాండ్ అనే అంతా అనుకుంటున్నారు. ఏపీ, తెలంగాణ సీఎంలు కలుస్తారు అని ఇటీవల కూడా వార్తలు వచ్చాయి. మొక్కులు చెల్లించుకునేందుకు రేవంత్‌రెడ్డి విజయవాడ కనక దుర్గమ్మ అమ్మవారి ఆలయానికి వస్తారని ఈ సందర్భంగా ఇద్దరూ భేటీ అవుతారని అనుకున్నారు. కానీ ఇప్పుడు స్విట్జర్లాండ్‌లో భేటీ అవుతారనే వార్తలు వినిపిస్తున్నాయి.

Updated On 30 Dec 2023 1:56 AM GMT
Ehatv

Ehatv

Next Story