ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) ఏర్పడబోయే నూతన ప్రభుత్వ సహకారంతో , ఉభయ తెలుగు రాష్ట్రాల(Telugu States) అభివృద్ధి సాధించేలా తన వంతు కృషి చేస్తానని, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తెలిపారు. ఇవాళ ఉదయం తిరుమల(Tirumala) శ్రీవారిని రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించి మొక్కులు తీర్చుకున్నారు.

వారికి ఆలయ అధికారుల స్వాగతం పలికే దశని ఏర్పాట్లు చేశారు‌. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలుకగా, అధికారులు తీర్థప్రసాదాలు అందచేసి శేష వసంత సత్కరించారు. శ్రీవారి జ్ఞాపికను అందజేశారు.. ఆలయం వెలుపల రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, త్వరలో ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటయ్యే నూతన ప్రభుత్వంతో సత్సంబంధాలు ఉండాలని కోరుకుంటునానని అన్నారు. ఉభయ రాష్ట్రాల్లో సమస్యల పరిష్కారానికి ఏపీ సీఎంతో చర్చిస్తామన్నారు. అలాగే తిరుమలలో, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కళ్యాణ మండపం, వసతి గృహం ఏర్పాటుకు, నూతన ప్రభుత్వ సహకారం తీసుకుంటామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం అనుకూలించి, రైతాంగం సస్యశ్యామలం కావాలని కోరారు.

Updated On 22 May 2024 2:31 AM GMT
Ehatv

Ehatv

Next Story