ఏపీ రోడ్ల(AP Roads) పరిస్థితిపై సీఎం కేసీఆర్(CM KCR) హాట్‌ కామెంట్లు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్‌ నేడు సత్తుపల్లి, ఇల్లందు బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ప్రత్యర్థులపై మాటల తూటాలు పేల్చుతున్నారు. ఏపీలో రోడ్లపై సీఎం కేసీఆర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఏపీ రోడ్ల(AP Roads) పరిస్థితిపై సీఎం కేసీఆర్(CM KCR) హాట్‌ కామెంట్లు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్‌ నేడు సత్తుపల్లి, ఇల్లందు బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ప్రత్యర్థులపై మాటల తూటాలు పేల్చుతున్నారు. ఏపీలో రోడ్లపై సీఎం కేసీఆర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'మేం చేసిన అభివృద్ధి చూడాలి అంటే మీ సరిహద్దుల్లోనే ఆంధ్రా ఉంది.. అక్కడి రోడ్లు, ఇక్కడి రోడ్లు చూస్తే మీకు మా అభివృద్ధి అర్థమవుతుందన్నారు'. మీరు రోజూ అటూఇటూ వెళ్లి వస్తుంటారు. నిత్యం పలు పనులతో అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు వెళ్తుంటారు మీకే అన్నీ తెలుసంటూ.. 'డబుల్ రోడ్డు వస్తే మనది.. సింగిల్‌ రోడ్డు వస్తే వాళ్లదని కేసీఆర్‌ అన్నారు'.

తెలంగాణ ఇస్తే మీకు పాలన చేతకాదు, మీరు పరిపాలించుకోలేరన్న ఆంధ్ర నేతలు, ఇప్పుడు అక్కడి ధాన్యాన్ని తెలంగాణలో అమ్ముకుంటున్నారన్నారు. మరో ఆసక్తికర విషయం కూడా ఆయన చెప్పారు. తెలంగాణ వస్తే కారుచీకట్లలో కమ్ముకుంటారని ఆఖరి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ కట్టె పట్టుకొని మరీ చెప్పాడు.. నేడు వాళ్లే చీకట్లలో మగ్గుతున్నారని సీఎం కేసీఆర్‌ అన్నారు. మోడీకి ప్రైవేటైజేషన్‌ పిచ్చి పట్టుకుందన్న ఆయన.. తెలంగాణలో మోటార్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం చెప్తే నా కంఠంలో ప్రాణముండగా నేను మోటర్ల కాడ మీటర్లు పెట్టేది లేదని సీఎం కేసీఆర్‌ చెప్పారు. అయితే ఏపీలోని శ్రీకాకుళంలో పైలట్‌ ప్రాజెక్ట్‌గాద మోటార్లకు మీటర్లు పెట్టారు. మోటార్లకు మీటర్లు పెట్టడంపై సీఎం కేసీఆర్‌ పరోక్షంగా ఏపీ ప్రస్తావన తీసుకొచ్చారంటున్నారు విశ్లేషకులు.

ఇదిలా ఉంటే ఏపీ అభివృద్ధిపై ఎన్నడూ కామెంట్స్‌ చేయని సీఎం కేసీఆర్, నేడు ఆ విషయాలను ఎందుకు ప్రస్తావించడంతో ఆసక్తి నెలకొంది. ఏపీ సీఎం అరెస్ట్‌ను ఖండించలేదని టీడీపీ కార్యకర్తలు బీఆర్‌ఎస్‌పై కొంత అసహనంగా ఉన్నందున నేడు ఏపీ సీఎం జగన్‌ పాలనను పరోక్షంగా విమర్శించడం.. బీఆర్‌ఎస్‌పై టీడీపీ క్యాడర్‌ ఆగ్రహాన్ని తగ్గించే ప్రయత్నం సీఎం కేసీఆర్‌ చేశారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.

Updated On 1 Nov 2023 7:09 AM GMT
Ehatv

Ehatv

Next Story