నేడు సీఎం జగన్ విజయవాడలో పర్యటించ‌నున్నారు. ఈ మేర‌కు సీఎంవో అధికారులు ప‌ర్య‌ట‌న‌కు సంబంధించి షెడ్యూల్‌ను విడుద‌ల చేశారు.

నేడు సీఎం జగన్(CM Jagan) విజయవాడ(Vijayawada)లో పర్యటించ‌నున్నారు. ఈ మేర‌కు సీఎంవో అధికారులు ప‌ర్య‌ట‌న‌కు సంబంధించి షెడ్యూల్‌ను విడుద‌ల చేశారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా సీఎం.. ఆంధ్రప్రదేశ్‌ సహకార బ్యాంక్‌ (APCOB) వజ్రోత్సవ వేడుకల(Diamond Jubilee Celebrations)కు ముఖ్యఅతిథిగా హాజరవుతారు. శుక్ర‌వారం ఉదయం 10.20 గంటలకు తాడేపల్లి(Thadepalli) నివాసం నుంచి బయలుదేరి ఎ కన్వెన్షన్‌ సెంటర్‌(A Convention Center)కు చేరుకుంటారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ సహకార బ్యాంక్‌ (ఆప్కాబ్‌) వజ్రోత్సవ వేడుకలలో పాల్గొన్న అనంతరం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. ముఖ్యమంత్రి(Chief Minister) పర్యటన కోసం అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు.

Updated On 3 Aug 2023 10:44 PM GMT
Yagnik

Yagnik

Next Story