CM Jagan : నేడు సత్యసాయి జిల్లాలో సీఎం జగన్ పర్యటన
నేడు సీఎం వైఎస్ జగన్ శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి పర్యటనకు వెళ్లనున్నారు. పర్యటనల భాగంగా వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్ నగదును సీఎం జగన్ రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు.

CM Jagan’s visit to Sathya Sai district today
నేడు సీఎం వైఎస్ జగన్(CM Jagan) శ్రీసత్యసాయి జిల్లా(Satysai District) పుట్టపర్తి(Puttaparthi) పర్యటనకు వెళ్లనున్నారు. పర్యటనల భాగంగా వైఎస్సార్ రైతు భరోసా(YSR Raithu Bharosa) – పీఎం కిసాన్(PM Kisan) నగదును సీఎం జగన్ రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. అ మేరకు అధికారులు పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఉదయం 9 గంటలకు తాడేపల్లి(THadepalli) నివాసం నుంచి బయలుదేరి పుట్టపర్తి చేరుకుంటారు, అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం.. వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్ నగదును రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. అనంతరం మధ్యాహ్నం అక్కడినుంచి బయలుదేరి తాడేపల్లి చేరుకుంటారు.
