CM Jagan : 12న సీఎం జగన్ పల్నాడు జిల్లా క్రోసూరు పర్యటన
ఈ నెల 12న సీఎం వైఎస్ జగన్ పల్నాడు జిల్లా క్రోసూరు పర్యటనకు వెళ్లనున్నారు. పర్యటనలో భాగంగా వరుసగా నాలుగో ఏడాది జగనన్న విద్యా కానుక పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నారు. ఈ మేరకు సీఎంవో అధికారులు పర్యటన షెడ్యూల్ ను విడుదల చేశారు.

CM Jagan’s visit to Palnadu District Krosur on 12th
ఈ నెల 12న సీఎం వైఎస్ జగన్(CM Jagan) పల్నాడు(Palnadu) జిల్లా క్రోసూరు(Krosur) పర్యటనకు వెళ్లనున్నారు. పర్యటనలో భాగంగా వరుసగా నాలుగో ఏడాది జగనన్న విద్యా కానుక(Jagananna Vidya Kanuka) పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నారు. ఈ మేరకు సీఎంవో అధికారులు పర్యటన షెడ్యూల్(Schedule) ను విడుదల చేశారు. ఉదయం 9 గంటలకు తాడేపల్లి(Thadepalli) నివాసం నుంచి బయలుదేరి క్రోసూరు చేరుకుంటారు. అక్కడ ఏపీ మోడల్ స్కూల్ వద్ద పెదకూరపాడు(Peddakurapadu) నియోజకవర్గంలో వివిధ అభివృద్ది పనులకు శంకుస్ధాపనలు చేస్తారు. అనంతరం బహిరంగ సభ(Public Meeting)లో జగనన్న విద్యా కానుక పథకాన్ని ప్రారంభిస్తారు. ప్రసంగం అనంతరం విద్యార్ధులకు కిట్స్ అందజేస్తారు. కార్యక్రమం అనంతరం బయలుదేరి మధ్యాహ్నం తాడేపల్లి చేరుకుంటారు.
