CM Jagan To Vist Nidadavolu : రేపు సీఎం జగన్ నిడదవోలు పర్యటన
తూర్పుగోదావరి(East Godavari) జిల్లా నిడదవోలులో(Nidadavolu) రేపు సీఎం వైఎస్ జగన్(CM YS Jagan) పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి.. వైఎస్సార్ కాపునేస్తం నిధులు బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు.

CM Jagan To Vist Nidadavolu
తూర్పుగోదావరి(East Godavari) జిల్లా నిడదవోలులో(Nidadavolu) రేపు సీఎం వైఎస్ జగన్(CM YS Jagan) పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి.. వైఎస్సార్ కాపునేస్తం నిధులు బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ మేరకు సీఎంవో అధికారులు పర్యటనకు సంబంధించి షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి(Thadepalli) నివాసం నుంచి బయలుదేరి నిడదవోలు(Nidadavolu) చేరుకుంటారు. అక్కడ సెయింట్ ఆంబ్రోస్ ఉన్నత పాఠశాల మైదానంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం వైఎస్సార్ కాపునేస్తం నిధులు బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తారు. కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
