క‌డ‌ప‌ జిల్లాలో రెండవ రోజు సీఎం వైఎస్ జగన్ పర్యటన కొనసాగుతుంది. ఉదయం ఇడుపులపాయ నుండి హెలికాప్టర్ ద్వారా గండికోట హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు.9.30 గంటలకు ప్రముఖ ఒబెరాయ్ హోటల్ సంస్థ గండికోట లో ఏర్పాటు చేయనున్న 5 స్టార్ హోటల్ శంకుస్థాపనలో పాల్గొంటారు. అనంతరం గండికోట వ్యూ పాయింట్ కు చేరుకుంటారు.

క‌డ‌ప‌ జిల్లా(Kadapa District)లో రెండవ రోజు సీఎం వైఎస్ జగన్(CM Jagan) పర్యటన కొనసాగుతుంది. ఉదయం ఇడుపులపాయ(Idupulapaya) నుండి హెలికాప్టర్(Helicopter) ద్వారా గండికోట(Gandikota) హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు.9.30 గంటలకు ప్రముఖ ఒబెరాయ్ హోటల్(Oberoi Hotel)సంస్థ గండికోట లో ఏర్పాటు చేయనున్న 5 స్టార్ హోటల్(Five Star Hotel) శంకుస్థాపనలో పాల్గొంటారు. అనంతరం గండికోట వ్యూ పాయింట్(View Point) కు చేరుకుంటారు. అనంతరం గండికోట నుండి బయల్దేరి పులివెందుల భాకరాపురం లోని హెలిప్యాడ్ చేరుకుంటారు. పులివెందుల(Pulivendula) పట్టణంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమల‌కు హాజరవుతారు.

పులివెందుల కొత్త మున్సి పల్ కార్యాలయ భవన ప్రారంభోత్సవం చేసి పులివెందుల మునిసిపల్ కౌన్సిలర్లతో సమావేశమవుతారు. అక్కడి నుంచి రాణితోపు వద్ద అటవీశాఖ అధికారులు నిర్మించిన పులివెందుల నగరవనం ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. అక్కడి నుండి గరండాల రివర్ ఫ్రంట్ కు చేరుకుని గుండాల కెనాల్ డెవలప్మెంట్ మొదటి దశ పనులను భూమి పూజ చేసి ప్రారంభిస్తారు. అక్కడి నుండి వైఎస్సార్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. న్యూటెక్ బయోసైన్స్, ఏపీ కార్ల్ ప్రారంభోత్సవాల‌కు హాజ‌ర‌వుతారు. 1.50 గంటలకు ఆర్అండ్ బీ గెస్ట్ హౌస్‌లో కాసేపు విరామం అనంతరం వైఎస్సార్ స్పోర్ట్స్ అకాడమి(YSR Sports Academy) ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం భాకరాపురం హెలిపాడ్ చేరుకుని ఇడుపులపాయ నివాసానికి బయలుదేరి వెళ్తారు.

Updated On 8 July 2023 10:40 PM GMT
Yagnik

Yagnik

Next Story