CM Jagan : జులై 4న సీఎం జగన్ చిత్తూరు జిల్లా పర్యటన
సీఎం వైఎస్ జగన్ జులై 4వ తేదీన చిత్తూరు జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. పర్యటనలో భాగంగా చిత్తూరు విజయా డెయిరీ వద్ద అమూల్ సంస్ధ ఏర్పాటు చేసే నూతన యూనిట్‌కు భూమిపూజ చేయనున్నారు. అనంతరం పోలీస్ పెరేడ్ మైదానంలో బహిరంగ సభకు హాజరై ప్రసంగిస్తారు.

CM Jagan’s visit to Chittoor district on July 4
సీఎం వైఎస్ జగన్(CM YS Jagan) జులై 4వ తేదీన చిత్తూరు(Chittoore) జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. పర్యటనలో భాగంగా చిత్తూరు విజయా డెయిరీ(Vijaya Diary) వద్ద అమూల్ సంస్ధ(Amul) ఏర్పాటు చేసే నూతన యూనిట్‌కు భూమిపూజ(Bhumi Puja)చేయనున్నారు. అనంతరం పోలీస్ పెరేడ్ మైదానంలో బహిరంగ సభ(Public Meeting)కు హాజరై ప్రసంగిస్తారు. ఆ తర్వాత క్రిస్టియన్ మెడికల్ కళాశాల (CMC) ఆవరణలో 300 పడకల ఆస్పత్రికి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ మేరకు సీఎంవో అధికారులు పర్యటన షెడ్యూల్ విడుదల చేశారు.
సీఎం జగన్ 4వ తేదీ ఉదయం 8 గంటలకు తాడేపల్లి(Thadepalli) నివాసం నుంచి బయలుదేరి 10 గంటలకు చిత్తూరు చేరుకుంటారు. చిత్తూరు విజయా డెయిరీ వద్ద అమూల్ సంస్ధ ఏర్పాటు చేసే నూతన యూనిట్‌కు భూమిపూజ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత పోలీస్ పెరేడ్ మైదానంలో బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం క్రిస్టియన్ మెడికల్ కళాశాల (సీఎంసీ) ఆవరణలో 300 పడకల ఆస్పత్రికి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
