ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి(CM Jagan) మార్చి నెల గండంలా మారనుందా..? అంటే అవుననే చెప్తున్నారు. గతేడాది మార్చిలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో(MLC Elections) రాయలసీమ, ఉత్తరాంధ్ర స్థానాల్లో టీడీపీ(TDP) విజయాలు దక్కించుకుంది. ముగ్గురు వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల మద్దతుతో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడం ద్వారా జగన్‌కు చుక్కెదురైంది. ఈ ఏడాది మార్చిలో వైసీపీ ఇదే పరిస్థితిని ఎదుర్కొనే అవకాశం ఉంది. సీఎం రమేష్(CM Ramesh), కనకమేడల రవీంద్రకుమార్, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పదవీ గడువు ముగియడంతో మూడు రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయి.

2019 ఎన్నికల తర్వాత టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో ముగ్గురు వైసీపీలో చేరినా.. ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీకి మద్దతు ఇస్తున్నారు. దీంతో టీడీపీకి 23 అయినప్పటికీ,రాజ్యసభ సీటు గెలవడానికి ఇది సరిపోదు. అయితే ఆ తర్వాత జగన్ మోహన్ రెడ్డి ఎమ్మెల్యే టిక్కెట్లలో మార్పులతో టీడీపీకి పలువురు ఎమ్మెల్యేలు సహకరిస్తున్నారు. వైసీపీపై(YCP) అసంతృప్తితో టీడీపీకి మరో 17 మంది ఎమ్మెల్యేలు టీడీపీకి వేస్తే రాజ్యసభ(Rajya Sabha) సీటు దక్కించుకునేందుకు అవసరమైన 40 ఓట్లు వచ్చి ఓ స్థానం దక్కించుకోవచ్చని ఆ పార్టీ నేతలు ఇప్పటినుంచే వ్యూహం పన్నుతున్నారు.
టీడీపీకి రాజ్యసభ సీటు దక్కితే అది పెద్ద ఆ పార్టీకి పెద్ద బలం చేకూరనుంది. వచ్చే అసెంబ్లీలో మరింత దూకుడును టీడీపీ ప్రదర్శించే అవకాశం ఉంది. ప్రజలు కూడా మెల్లగా అటు డైవర్ట్‌ అయితే టీడీపీ విజయం నల్లేరుపై నడకే అవుతుందని ఆ పార్టీ నేతలు అభిప్రాయ పడుతున్నారు.
టీడీపీ నుంచి పోటీ చేసేందుకు ఇద్దరు ఆసక్తి చూపుతున్నారని, సంక్రాంతి తర్వాత చంద్రబాబు(Chandrababu) తుది నిర్ణయం తీసుకుంటారని ఆ పార్టీ వర్గాలు లీకులు ఇస్తున్నాయి.

Updated On 8 Jan 2024 4:51 AM GMT
Ehatv

Ehatv

Next Story