CM Jagan Uttarandhra Tour : నేడు ఉత్తరాంధ్రకు సీఎం జగన్.. భోగాపురం ఎయిర్‌పోర్టు సహా కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపనలు
సీఎం వైఎస్ జగన్ రూ. 4,592 కోట్ల వ్యయంతో నిర్మించనున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి నేడు భోగాపురంలో శంకుస్ధాపన చేయనున్నారు. అలాగే.. రూ. 21,844 కోట్ల వ్యయంతో విశాఖపట్నంలో నిర్మిస్తున్న వైజాగ్ టెక్‌పార్క్, రూ. 194.40 కోట్ల వ్యయంతో చేపట్టనున్న తారకరామ తీర్ధ సాగరం ప్రాజెక్ట్ పనులకు, విజయనగరం జిల్లాలో రూ. 23.73 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న చింతపల్లి ఫిష్ ల్యాండింగ్ సెంటర్‌కు కూడా నేడు సీఎం జగన్ శంకుస్ధాపన చేయనున్నారు.
సీఎం వైఎస్ జగన్(YS Jagan) రూ. 4,592 కోట్ల వ్యయంతో నిర్మించనున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాని(Bogapuram International Airport)కి నేడు భోగాపురం(Bogapuram)లో శంకుస్ధాపన చేయనున్నారు. అలాగే.. రూ. 21,844 కోట్ల వ్యయంతో విశాఖపట్నంలో నిర్మిస్తున్న వైజాగ్ టెక్‌పార్క్(Vizag Tech Park), రూ. 194.40 కోట్ల వ్యయంతో చేపట్టనున్న తారకరామ తీర్ధ సాగరం(Tarakarama Theertha Sagaram) ప్రాజెక్ట్ పనులకు, విజయనగరం(Vijayanagaram) జిల్లాలో రూ. 23.73 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న చింతపల్లి ఫిష్ ల్యాండింగ్ సెంటర్(Chinthapalli Fish Landing Center)కు కూడా నేడు సీఎం జగన్ శంకుస్ధాపన చేయనున్నారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం
నేడు సీఎం జగన్ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులకు భూమి పూజ చేయనున్నారు. రూ. 4,592 కోట్ల వ్యయంతో 2,203 ఎకరాల విస్తీర్ణంలో 36 నెలల్లో నిర్మాణం పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేశారు. ఏడాదికి 60 లక్షల మంది ప్రయాణించేందుకు వీలుగా.. పెరుగుతున్న ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఏడాదికి 1.8 కోట్ల మంది ప్రయాణించే విధంగా దశల వారీగా సౌకర్యాల విస్తరణ చేసేందుకు అణువుగా ఎయిర్ పోర్టు నిర్మాణం జరుగుతుంది.
వైజాగ్ టెక్‌పార్క్
అదానీ గ్రూప్(Adani Group) ఆధ్వర్యంలో రూ. 14,634 కోట్లతో మధురవాడలో 200 మెగావాట్ల ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్, టెక్నాలజీ, బిజినెస్ పార్క్ ఏర్పాటు చేయనున్నారు. త్వరలో రూ. 7,210 కోట్లతో కాపులుప్పాడలో మరో 100 మెగావాట్ల ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్(Intigrated Data Center), టెక్నాలజీ, బిజినెస్ పార్క్(Business Park)ల అభివృద్ది చేయనున్నారు. తద్వారా 39,815 మందికి ప్రత్యక్షంగా, 10,610 మందికి పరోక్షంగా ఉపాధి లభించనుందని ప్రభుత్వం వెల్లడించింది.
తారకరామ తీర్ధ సాగరం ప్రాజెక్టు
విజయనగరం జిల్లా పూసపాటిరేగ, భోగాపురం, డెంకాడ మండలాల్లోని 49 గ్రామాల ప్రజలకు త్రాగునీరు, 24,710 ఎకరాలకు సాగునీరుతో పాటు భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు అవసరమైన నీరు అందించడమే లక్ష్యంగా రూ. 194.40 కోట్ల వ్యయంతో తారకరామ తీర్ధ సాగరం ప్రాజెక్ట్ పనులు ప్రారంభించనున్నారు సీఎం జగన్. డిసెంబర్ 2024 నాటికి పనులు పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.
చింతపల్లి ఫిష్‌ల్యాండింగ్ సెంటర్
విజయనగరం జిల్లాలోని వేలాదిమంది మత్స్యకారులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా మేలు జరిగేలా.. పూసపాటిరేగ మండలం చింతపల్లి సముద్ర తీరంలో రూ. 23.73 కోట్ల వ్యయంతో ఫిష్ ల్యాండింగ్ సెంటర్ నిర్మాణ పనులకు సీఎం నేడు శంకుస్థాపన చేస్తున్నారు. అన్ని కాలాల్లో సముద్రంలో సులువుగా చేపలు పట్టేందుకు వెసులుబాటు, తుఫాను, విపత్తు సమయాల్లో సురక్షితంగా ఒడ్డుకు చేరేందుకు, అలల తాకిడికి పడవలు దెబ్బతినకుండా లంగర్ వేసే సదుపాయాలు కల్పిస్తూ.. మత్స్యకారుల ఆదాయం పెరుగుదలే లక్ష్యంగా ఈ కార్యక్రమానికి సీఎం శ్రీకారం చుడుతున్నారు.