రేపు సీఎం వైఎస్ జగన్ విజయవాడలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా వైయస్సార్ లైఫ్‌టైం ఎచీవ్‌మెంట్ అవార్డులు, ఎచీవ్‌మెంట్ అవార్డుల ప్రధాన కార్యక్రమంలో పాల్గొననున్నారు.
రేపు సీఎం వైఎస్ జగన్(CM Jagan) విజయవాడ(Vijayawada)లో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా వైయస్సార్ లైఫ్‌టైం ఎచీవ్‌మెంట్ అవార్డులు(YSR Lifetime Achievement Awards), ఎచీవ్‌మెంట్ అవార్డుల ప్రధాన కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి గవర్నర్(Governor) కూడా హాజరుకానున్నారు. సీఎం పర్యటనకు సంబంధించి అధికారులు షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఉదయం 10.48 గంటలకు సీఎం జగన్ తాడేపల్లి(Thadepalli) నివాసం నుంచి బయలుదేరి విజయవాడ ఎ కన్వెన్షన్ సెంటర్(A Convention Center)కు చేరుకుంటారు. అక్కడ జరగనున్న వైయస్సార్ లైఫ్‌టైం ఎచీవ్‌మెంట్ అవార్డులు, ఎచీవ్‌మెంట్ అవార్డుల ప్రధాన కార్యక్రమంలో గవర్నర్‌తో కలిసి పాల్గొంటారు. కార్యక్రమం అనంతరం సీఎం మధ్యాహ్నం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
అంతకుముందు ఉదయం 10.15 గంటలకు సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగే ఆంధ్రప్రదేశ్ అవతరణ వేడుకలలో పాల్గొంటారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. తర్వాత తెలుగుతల్లి(Telugu Thalli)కి, అమరజీవి పొట్టి శ్రీరాములు(Potti Sriramulu)కు నివాళులర్పిస్తారు. కార్యక్రమం అనంతరం ఎ కన్వెన్షన్ సెంటర్‌కు బయలుదేరి వెళతారు.