CM Jagan : నేడు విజయవాడలో పర్యటించనున్న సీఎం జగన్
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంగళవారం విజయవాడలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా సీఎం మిషనరీస్ ఆఫ్ ఛారిటీ నిర్మల్ హృదయ్ భవన్‌లో అనాధ పిల్లలతో ముచ్చటించనున్నారు. ఈ మేరకు అధికారులు పర్యటన వివరాలు వెల్లడించారు.

CM Jagan will visit Vijayawada today
ముఖ్యమంత్రి వైఎస్ జగన్(YS Jagan) మంగళవారం విజయవాడ(Vijayawada)లో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా సీఎం మిషనరీస్ ఆఫ్ ఛారిటీ నిర్మల్ హృదయ్ భవన్(Missionaries of Charity Nirmal Hriday Bhavan)లో అనాధ పిల్లల(Orphan children)తో ముచ్చటించనున్నారు. ఈ మేరకు అధికారులు పర్యటన వివరాలు వెల్లడించారు. ఉదయం 10 గంటలకు సీఎం తాడేపల్లి(Thadepalli) నుంచి విజయవాడ బయలుదేరుతారు. విజయవాడ రాఘవయ్య పార్కు(Raghavaiah Park) సమీపంలోని మిషనరీస్ ఆఫ్ ఛారిటీ నిర్మల్ హృదయ్ భవన్‌ను సీఎం జగన్ సందర్శిస్తారు. 10.10 గంటల నుంచి 10.40 వరకు అనాధ పిల్లలతో ముచ్చటిస్తారు. అనంతరం తిరిగి తాడేపల్లి చేరుకుంటారు.
