సీఎం జగన్ నేడు గుంటూరు జిల్లా మంగళగిరి, కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ముందుగా మంగళగిరి సీ కే కన్వెన్షన్‌ సెంటర్‌లో జరగనున్న పేర్నాటి శ్యామ్‌ ప్రసాద్‌ రెడ్డి సోదరుడు పేర్నాటి రామలింగారెడ్డి కుమారుడు కౌశిక్‌ వివాహానికి సీఎం హాజరవుతారు.

సీఎం జగన్(CM Jagan) నేడు గుంటూరు(Guntur) జిల్లా మంగళగిరి(Mangalagiri), కర్నూలు(Kurnool) జిల్లాలో పర్యటించనున్నారు. ముందుగా మంగళగిరి సీ కే కన్వెన్షన్‌ సెంటర్‌(CK Convention Centre)లో జరగనున్న పేర్నాటి శ్యామ్‌ ప్రసాద్‌ రెడ్డి(Pernati Shyam Prasad Reddy) సోదరుడు పేర్నాటి రామలింగారెడ్డి(Pernati Ramalinga Reddy) కుమారుడు కౌశిక్‌(Kaushik) వివాహానికి సీఎం హాజరవుతారు. అనంతరం సీఎం కర్నూలు జిల్లా పత్తికొండ(Pathikonda)లో వరుసగా ఐదో ఏడాది.. మొదటి విడతగా వైయస్సార్‌ రైతుభరోసా(YSR Rythu Bharosa).. పీఎం కిసాన్‌(PM Kisan) పథకం లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తారు. ఈ మేర‌కు సీఎంవో అధికారులు ప‌ర్య‌ట‌న వివ‌రాలు వెల్ల‌డించారు.

గురువారం ఉదయం 7.30 గంటలకు సీఎం జగన్‌ తాడేపల్లి(Thadepalli) నివాసం నుంచి బయలుదేరి గుంటూరు జిల్లా మంగళగిరి చేరుకుంటారు. మంగళగిరిలోని సీ కే కన్వెన్షన్‌ సెంటర్‌లో జరగనున్న పేర్నాటి శ్యామ్‌ ప్రసాద్‌ రెడ్డి సోదరుడు పేర్నాటి రామలింగారెడ్డి కుమారుడు కౌశిక్‌ పెళ్లికి హాజరై వధూవరులను ఆశీర్వదిస్తారు. అనంతరం అక్కడ నుంచి గన్నవరం చేరుకుని.. కర్నూలు జిల్లాకు బయులుదేరుతారు.

కర్నూలు జిల్లా పత్తికొండలోని సెయింట్‌ జోసెఫ్‌ ఇంగ్లిషు మీడియం స్కూల్‌(St. Joseph's English Medium School)లో ఏర్పాటు చేసిన బహిరంగసభా వేదికకు చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగసభలో ప్రసంగించిన అనంతరం.. వరుసగా ఐదో ఏడాది.. తొలివిడత వైయస్సార్‌ రైతుభరోసా.. పీఎం కిసాన్‌ పథకం లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేసే కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. సభ అనంతరం మధ్యాహ్నం సీఎం తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

Updated On 31 May 2023 8:03 PM GMT
Yagnik

Yagnik

Next Story