CM Jagan : రేపు సీఎం జగన్ గుంటూరు జిల్లా పర్యటన
రేపు సీఎం వైఎస్ జగన్ గుంటూరు జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. పర్యటనలో భాగంగా సీఆర్డీఏ పరిధిలో (కృష్ణాయపాలెం జగనన్న లే అవుట్) పేదల ఇళ్ళ నిర్మాణాలకు సీఎం జగన్ శంకుస్ధాపన చేయనున్నారు. ఈ మేరకు సీఎంవో అధికారులు పర్యటన ఫెడ్యూల్ విడుదల చేశారు.

CM Jagan will visit Guntur district tomorrow
రేపు సీఎం వైఎస్ జగన్(CM YS Jagan) గుంటూరు(Guntur) జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. పర్యటనలో భాగంగా సీఆర్డీఏ(CRDA) పరిధిలో (కృష్ణాయపాలెం జగనన్న లే అవుట్) పేదల ఇళ్ళ నిర్మాణాలకు సీఎం జగన్ శంకుస్ధాపన(Foundation) చేయనున్నారు. ఈ మేరకు సీఎంవో అధికారులు పర్యటన షెడ్యూల్(Schedule) విడుదల చేశారు. ఉదయం 9.30 గంటలకు సీఎం జగన్ తాడేపల్లి(Thadepalli) నివాసం నుంచి బయలుదేరి కృష్ణాయపాలెం హౌసింగ్ లే అవుట్(Krishnayapalem Housing Layout)కు చేరుకుంటారు. అక్కడ వన మహోత్సవం సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ఇళ్ళ నిర్మాణ శంకుస్ధాపన కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడే మోడల్ హౌస్(Model House)ను పరిశీలించిన అనంతరం వెంకటపాలెం(Venkatapalem) చేరుకుని లబ్ధిదారులకు ఇంటి మంజూరు పత్రాల పంపిణీ కోసం ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. కార్యక్రమం తర్వాత మధ్యాహ్నం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
