వచ్చే ఎన్నికల్లో సోషల్ ఇంజినీరింగ్(Social engineering) చేయడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించాలని వైసీపీ(YCP) అధిష్టానం భావిస్తోంది. గత ఎన్నికల్లోనూ అనంతపురం, హిందూపురం ఎంపీ స్థానాల్లో సోషల్ ఇంజినీరింగ్ ద్వారా మెరుగైన ఫలితాలను సాధించింది. అనంతపురం, హిందూపురం రెండు స్థానాల్లో బోయ, కురుమ సామాజికవర్గాలకు చెందిన అభ్యర్థులను బరిలోకి దించడం వల్ల..ఆ రెండు నియోజకవర్గాల్లో ఉన్న ఆయా సామాజికర్గాల ఓట్లను గుండుగుత్తగా వైసీపీకి వేయించుకోగలిగింది.

వచ్చే ఎన్నికల్లో సోషల్ ఇంజినీరింగ్(Social engineering) చేయడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించాలని వైసీపీ(YCP) అధిష్టానం భావిస్తోంది. గత ఎన్నికల్లోనూ అనంతపురం, హిందూపురం ఎంపీ స్థానాల్లో సోషల్ ఇంజినీరింగ్ ద్వారా మెరుగైన ఫలితాలను సాధించింది. అనంతపురం, హిందూపురం రెండు స్థానాల్లో బోయ, కురుమ సామాజికవర్గాలకు చెందిన అభ్యర్థులను బరిలోకి దించడం వల్ల..ఆ రెండు నియోజకవర్గాల్లో ఉన్న ఆయా సామాజికర్గాల ఓట్లను గుండుగుత్తగా వైసీపీకి వేయించుకోగలిగింది. దీంతో అక్కడ ఇద్దరు అభ్యర్థులు విజయం సాధించారు. సో..అక్కడ సోషల్ ఇంజినీరింగ్ ఫలించిందన్నమాట. అందుకే ఈసారి రెడ్డి సామాజికర్గానికి చెందిన కొంత మంది సీట్లను కూడా మార్చి బీసీలకు అవకాశం కల్పిస్తోంది . బీసీలు కేంద్రంగా వైసీపీ ఎన్నికలకు వెళ్తున్న వాతావరణం కనపడుతోంది. ఈ నేపథ్యంలో..ఉమ్మడి గుంటూరుజిల్లాకు సంబంధించిన రెండు పార్లమెంట్ స్థానాల్లో కూడా బీసీలకు అవకాశం కల్పించాలని వైసీపీ యోచిస్తోంది.

ఆ రెండు పార్లమెంట్ స్థానాలు ..ఒకటి నరసరావుపేట(Narasaraopet) కాగా..మరొకటి గుంటూరు నియోజకవర్గం. పేట వైసీపీ సిట్టింగ్ స్థానం కాగా..గుంటూరు టీడీపీ సిట్టింగ్ స్థానంగా ఉంది. గుంటూరు సిట్టింగ్ ఎంపీగా కమ్మసామాజికవర్గానికి చెందిన గల్లా జయదేవ్ ఉన్నారు. గతంలో వైపీపీ(YCP) అభ్యర్థిగా మోదుగుల వేణుగోపాల్‎రెడ్డి(Venugopal reddy) పోటీ చేసి ఓడిపోయారు. ఈ సారి ఇక్కడి నుంచి కూడా బీసీల్లోని కాపు సామాజికర్గానికి చెందిన అభ్యర్థిని ఎన్నికల బరిలోకి దింపాలని వైసీపీ యోచిస్తోంది. కాపు సామాజికవర్గం నుంచి గుంటూరుజిల్లాలో బాగా పేరున్న ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు(Ummareddy Venkateshwarlu) కుటుంబం నుంచి ఓ వ్యక్తిని గుంటూరు పార్లమెంట్ కు పోటీ చేయించాలని అనుకుంటోంది. గుంటూరు ఎంపీ స్థానం నుంచి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తనయుడిని బరిలోకి దించడం ద్వారా మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్న కాపు సామాజికవర్గం ఓట్లను గుండుగుత్తగా వేయించుకోవచ్చనే ఆలోచన వైసీపీ అధిష్టానం చేస్తోంది. సోషల్ ఇంజనీరింగ్‎లో భాగంగా నరసరావుపేటలో యాదవ, మరోచోట కాపు సామాజికర్గం నుంచి ఎంపీ అభ్యర్థులను బరిలో దించడం ద్వారా.. ఏ ప్రాంతంలోనైతే తాము గణనీయంగా సీట్లు సాధిస్తామని టీడీపీ-జనసేన కూటమి అనుకుంటుందో..అక్కడ ‎ఇలాంటి సోషల్ ఇంజినీరింగ్ ద్వారా వారి ఆశలకు భారీగా గండికొట్టొచ్చనేది వైసీపీ రాజకీయ ఎత్తుగడ. దీనికి సంబంధించి ఒకటి రెండు రోజుల్లోనే అధికారిక ప్రకటన వెలువడుతుందని పార్టీ వర్గాలు చెబుతున్న సమాచారం.

Updated On 27 Jan 2024 5:06 AM GMT
Ehatv

Ehatv

Next Story