రేపు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘ‌నంగా జ‌రుగ‌నున్నాయి. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి.

రేపు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియం(Vijayawada Indira Gandhi Municipal Stadium)లో గణతంత్ర దినోత్సవ వేడుకలు(Republic Day Celebrations) ఘ‌నంగా జ‌రుగ‌నున్నాయి. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. ఈ వేడుక‌ల్లో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్(CM Jagan) పాల్గొన‌నున్నారు. ఉదయం 8.50 గంటలకు తాడేపల్లి(Thadepalli) నివాసం నుంచి సీఎం జగన్ బయలుదేరుతారు. రిపబ్లిక్‌ డే వేడుకలలో పాల్గొని అనంతరం తాడేపల్లి నివాసానికి తిరుగు పయనమ‌వుతారు. సాయంత్రం 4.15 గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ ఆథిద్యం ఇచ్చే హై టీ కార్యక్రమంలో పాల్గొంటారు.
భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఉ.8 గం.లకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ(Assembly) భవనం ప్రాంగణంలో శాసన మండలి అధ్యక్షుడు కె.మోషేన్ రాజు(Moshen Raju) గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు.
ఉ.8.15 గం.లకు రాష్ట్ర అసెంబ్లీ భవనం వద్ద రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం(Thammineni Seetharam) గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు.
సచివాలయం మొదటి బ్లాకు వద్ద:
సచివాలయం(Secretariat) మొదటి బ్లాకు వద్ద శుక్రవారం ఉ.7.30 గం.లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు.
రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం వద్ద:
నేలపాడులోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం(High Court) వద్ద శుక్రవారం ఉ.10 గం.లకు రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింఘ్ ఠాకూర్(Justice Dheeraj Singh Thakur) గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు.
Updated On 25 Jan 2024 6:26 AM GMT
Yagnik

Yagnik

Next Story