CM Jagan's visit to yemmiganur : 19న సీఎం జగన్ ఎమ్మిగనూరు పర్యటన
ముఖ్యమంత్రి వైఎస్ జగన్(CM Jagan) ఈ నెల 19వ తేదీన కర్నూలు(Kurnool) జిల్లా ఎమ్మిగనూరులో(Emmiganur ) పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా జగనన్న చేదోడు పథకం(Jagananna Chedhodu scheme) కింద లబ్ధిదారులకు నిధులు విడుదల చేయనున్నారు.

CM Jagan’s visit to yemmiganur
ముఖ్యమంత్రి వైఎస్ జగన్(CM Jagan) ఈ నెల 19వ తేదీన కర్నూలు(Kurnool) జిల్లా ఎమ్మిగనూరులో(yemmiganur) పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా జగనన్న చేదోడు పథకం(Jagananna Chedhodu scheme) కింద లబ్ధిదారులకు నిధులు విడుదల చేయనున్నారు. పర్యటనకు సంబంధించి సీఎంవో అధికారులు షెడ్యూల్ విడుదల చేశారు. 19వ తేదీ ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ఎమ్మిగనూరు చేరుకుంటారు. అక్కడ వీవర్స్ కాలనీ వైడబ్ల్యూసీఎస్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని జగనన్న చేదోడు పథకం లబ్ధిదారులకు నిధులు విడుదల చేస్తారు. ఆ తర్వాత బహిరంగ సభనుద్దేశించి ప్రసంగిస్తారు. కార్యక్రమం అనంతరం అక్కడినుంచి బయలుదేరి మధ్యాహ్నం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
