Ganji Chiranjeevi : ఏపీ వైసీపీలో బీసీ మంత్రం..సామాజికవర్గాల ఓట్లే టార్గెట్ !
ఏపీలో(AP) రెండోసారి అధికారం కోసం ముఖ్యమంత్రి, వైసీసీ అధినేత వైఎస్ జగన్(CM Jagan) కసరత్తు మొదలుపెట్టారు. ఈసారి ఎన్నికల్లో గట్టెక్కడానికి అన్ని అస్త్రాలను సంధిస్తున్నారు ఆ పార్టీ అధినేత అధినేత జగన్మోహన్రెడ్డి. గెలుపు గుర్రాలకే టికెట్లు కేటాయించాలని యోచిస్తున్న జగన్.. సామాజిక సమీకరణలపై దృష్టి సారించారు. బీసీలకు తామే పెద్దపీట వేశామని చెప్పుకుంటున్న టీడీపీకి(TDP) చెక్ పెట్టేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఈసారి బీసీలకు పెద్ద ఎత్తున టికెట్లు కేటాయించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.

Ganji Chiranjeevi
ఏపీలో(AP) రెండోసారి అధికారం కోసం ముఖ్యమంత్రి, వైసీసీ అధినేత వైఎస్ జగన్(CM Jagan) కసరత్తు మొదలుపెట్టారు. ఈసారి ఎన్నికల్లో గట్టెక్కడానికి అన్ని అస్త్రాలను సంధిస్తున్నారు ఆ పార్టీ అధినేత అధినేత జగన్మోహన్రెడ్డి. గెలుపు గుర్రాలకే టికెట్లు కేటాయించాలని యోచిస్తున్న జగన్.. సామాజిక సమీకరణలపై దృష్టి సారించారు. బీసీలకు తామే పెద్దపీట వేశామని చెప్పుకుంటున్న టీడీపీకి(TDP) చెక్ పెట్టేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఈసారి బీసీలకు పెద్ద ఎత్తున టికెట్లు కేటాయించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.
2024 అసెంబ్లీ ఎన్నికలపై వైసీపీ అధినేత జగన్ సీరియస్‌గా ఫోకస్ పెట్టారు. ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్(KCR) సిట్టింగులకు ఎక్కువ సీట్లివ్వడం వల్లే బీఆర్ఎస్(BRS) పార్టీ అధికారాన్ని కోల్పోయిందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ తరుణంలో ఏపీలో సుమారు 50 నుంచి 80 సీట్లలో ఈసారి కొత్త ముఖాలకు అవకాశం ఇవ్వాలని జగన్ నిర్ణయించారని తెలుస్తోంది. గెలుపే ప్రామాణికంగా అభ్యర్థులను ఎంపిక చేయాలని జగన్ యోచిస్తున్నారు. ఇప్పటికే ఆ దిశగా అడుగులు వేస్తున్నారు వైసీపీ అధినేత జగన. ఈ ప్రక్రియలో భాగంగా సీనియర్లు - మంత్రులకు షాకులు ఇస్తున్నారు. ఇప్పటికే 11 నియోజకవర్గాలకు కొత్త ఇంఛార్జ్‌లను ప్రకటించిన సంగతి తెలిసిందే. మరో 36 నియోజకవర్గాల్లోనూ మార్పులకు సిద్ధం అయినట్లు సమాచారం.
వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే టికెట్లు అనే ట్యాగ్ లైన్ పెట్టుకొని పని కసరత్తు మొదలు పెట్టిన జగన్.. తొలి జాబితాలోనే ముగ్గురు మంత్రులు షాకిచ్చారు. మంత్రులు విడుదల రజని(Vidudhala Rajini), ఆదిమూలపు సురేష్(Adimulapu Suresh), మేరుగు నాగార్జున(Merugu Nagarjuna) తమ నియోజకవర్గాలను కోల్పోయారు. రెండో విడతలో మరో ఆరుగురు మంత్రుల విషయంలోనూ ఇదే తరహా షాకులు ఉంటాయని తెలుస్తోంది. రాయలసీమ ప్రాంతంలోని రెండు జిల్లాలకు చెందిన మంత్రులు, ఉత్తరాంధ్ర జిల్లాలోని మరో నలుగురు మంత్రులకు స్థాన చలనం తప్పదని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే వారికి సమాచారం చేరిపోయిందంటున్నారు.
ఒకవైపు సానుకూలతలేని సిట్టింగ్ లను మారుస్తూనే..సామాజికవర్గాల వారీగా సీట్ల కేటాయింపుపై వైసీపీ అధినేత, సీఎం జగన్ దృష్టి పెట్టారు. ఈసారి బీసీలకు ఎక్కువ సీట్లు కేటాయించాలనే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. టీడీపీకి బీసీ ఓట్లు వెన్నెముకగా చెబుతుంటారు. సరిగ్గా ఇప్పుడు బీసీ ఓట్లనే టార్గెట్ గా జగన్ అభ్యర్థుల ఎంపిక చేస్తున్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగానే మంగళగిరి నియోజకవర్గంలో రెండుసార్లు నారా లోకేష్ ను ఓడించిన ఆళ్ల రామకృష్ణారెడ్డిని(Alla Ramakishna Reddy) ఈసారి పక్కనబెట్టి బీసీ, పద్మాలికి సామాజికవర్గానికి చెందిన గంజి చింరజీవిని(Ganji Chiranjeevi) జగన్ ఎన్నికల బరిలోకి దించుతున్నారు. ఇదే ఫార్మూలాను పలుచోట్ల ఉపయోగించి తానే అసలైన బీసీబంధు అని చెప్పడం వైసీపీ లక్ష్యంగా కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఆరోగ్యశాఖ మంత్రి విడుదల రజనిఇన చిలకలూరిపేట నుంచి గుంటూరు పశ్చిమకు మార్చారు. అదే విధంగా పవన్ కల్యాణ్ పై గాజువాకలో గెలిచిన తిప్పారెడ్డి నాగిరెడ్డిని, అతని కుమారున్ని బీసీ అభ్యర్థిని ఎంపిక చేశారు. రేపల్లెలో టీడీపీలో మంత్రిగా పని చేసిన ఈపూరు సీతారావమ్మ కుమారుడు డాక్టర్ గణేష్ ను ఎంపిక చేశారని సమాచారం.
