CM Jagan : నేడు షర్మిల కుమారుడి వివాహ నిశ్చితార్ధ వేడుకకు హాజరుకానున్న సీఎం జగన్
నేడు సీఎం వైఎస్ జగన్ హైదరాబాద్ పర్యటనకు వెళ్లనున్నారు. పర్యటనలో భాగంగా సోదరి వైఎస్ షర్మిల కుమారుడి వివాహ నిశ్చితార్ధ వేడుకకు హాజరై

CM Jagan will attend Sharmila’s son’s engagement ceremony
నేడు సీఎం వైఎస్ జగన్(CM Jagan) హైదరాబాద్(Hyderabad) పర్యటనకు వెళ్లనున్నారు. పర్యటనలో భాగంగా సోదరి వైఎస్ షర్మిల(YS Sharmila) కుమారుడి(Rajareddy) వివాహ నిశ్చితార్ధ వేడుకకు హాజరై నూతన వధూవరులను ముఖ్యమంత్రి జగన్ ఆశీర్వదించనున్నారు. ఈ మేరకు సీఎంవో అధికారులు ముఖ్యమంత్రి పర్యటన షెడ్యూల్‌ను విడుదల చేశారు. సాయంత్రం 6.15 గంటలకు తాడేపల్లి(Thadepalli) నివాసం నుంచి బయలుదేరి హైదరాబాద్ చేరుకుంటారు. అక్కడ గండిపేట(Gandipet)లోని గోల్కొండ రిసార్ట్స్(Golkonda Resorts) లో సోదరి వైఎస్ షర్మిల(YS Sharmila) కుమారుడి వివాహ నిశ్చితార్ధ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. అనంతరం రాత్రికి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
