Pulivendula : పులివెందులలో అన్నపై పోరుకు షర్మిల సిద్ధం!
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ(APCC) పగ్గాలు చేపట్టిన తర్వాత వై.ఎస్.షర్మిల(YS Sharmila) మీటింగ్‌లు పెడుతున్నారు. తన అన్న, ఏపీ సీఎం జగన్‌పై(CM Jagan) విమర్శలు చేస్తున్నారు. అసలు ఆమె జగన్ టార్గెట్‌గానే ఏపీలో అడుగుపెట్టారన్నది జగమెరిగిన సత్యం. ఇన్‌డైరెక్ట్‌గా తెలుగుదేశంపార్టీకి(TDP) సాయం చేయడం కోసమే అన్నట్టుగా ఆమె కదలికలు ఉంటున్నాయి. ఇప్పుడు జగన్‌పై బురదచల్లుతూ ప్రసంగాలు చేయడం ద్వారా ఎవరికి మేలు జరుగుతుంది? వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అభిమానుల ఓట్లు చీలిస్తే ఎవరు లాభపడతారు? కాంగ్రెస్ పార్టీకి పది అసెంబ్లీ స్థానాలైనా వస్తాయా? అసలు ఎన్ని స్థానాలలో డిపాజిట్లు వస్తాయి? ఇవన్నీ ఏపీ ప్రజలకు వస్తున్న అనుమానాలు.
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ(APCC) పగ్గాలు చేపట్టిన తర్వాత వై.ఎస్.షర్మిల(YS Sharmila) మీటింగ్‌లు పెడుతున్నారు. తన అన్న, ఏపీ సీఎం జగన్‌పై(CM Jagan) విమర్శలు చేస్తున్నారు. అసలు ఆమె జగన్ టార్గెట్‌గానే ఏపీలో అడుగుపెట్టారన్నది జగమెరిగిన సత్యం. ఇన్‌డైరెక్ట్‌గా తెలుగుదేశంపార్టీకి(TDP) సాయం చేయడం కోసమే అన్నట్టుగా ఆమె కదలికలు ఉంటున్నాయి. ఇప్పుడు జగన్‌పై బురదచల్లుతూ ప్రసంగాలు చేయడం ద్వారా ఎవరికి మేలు జరుగుతుంది? వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అభిమానుల ఓట్లు చీలిస్తే ఎవరు లాభపడతారు? కాంగ్రెస్ పార్టీకి పది అసెంబ్లీ స్థానాలైనా వస్తాయా? అసలు ఎన్ని స్థానాలలో డిపాజిట్లు వస్తాయి? ఇవన్నీ ఏపీ ప్రజలకు వస్తున్న అనుమానాలు. కాంగ్రెస్ అధినాయకత్వం కూడా పెద్దగా ఆశపడటం లేదు. ఓటు బ్యాంకు పెరిగితే అదే పదివేలని, అందుకు షర్మిల ఉపయోగపడితే చాలని భావిస్తోంది. ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి రాదన్న విషయం షర్మిలకు కూడా తెలుసు.
అందుకే ఆమె తనను రాజ్యసభ సభ్యురాలిని(Rajya sabha) చేయాలని ముందస్తు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ కండిషన్ మీదనే ఆమె కాంగ్రెస్‌లో చేరారు. ఈ నేపథ్యంలో షర్మిల ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే చర్చ మొదలయ్యింది. కడప జిల్లా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని షర్మిల అనుకుంటున్నారట! అంటే తన అన్న జగన్మోహన్‌రెడ్డిపై పోటీ చేయబోతున్నారన్నమాట! కడప జిల్లాలో పర్యటించిన షర్మిల అక్కడ వైఎస్ వివేకానందరెడ్డి(YS Vivekanada Reddy) కూతురు సునీతను కలుసుకున్నారు. తన తండ్రి వివేకా హత్య వెనుక అవినాష్‌రెడ్డి(Avinash) హస్తం ఉందంటూ మొదటి నుంచి చెబుతూ వస్తున్న సునీతకు షర్మిల మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే! ఇకపై కూడా కలిసే పోరాటం సాగిద్దామని ఈ సందర్భంగా సునీతతో షర్మిల చెప్పారని తెలిసింది. కాంగ్రెస్ తరఫున ఎన్నికల్లో పోటీ చేయాలని సునీతను అడిగారట! పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం, కడప లోక్‌సభ నియోజకవర్గం .. ఈ రెండింటిలో ఏదో ఒక దానికి ఎంచుకోవాల్సిందిగా సునీతను షర్మిల కోరినట్టు తెలిసింది. ఈ రెండు స్థానాలలో కాంగ్రెస్ తరఫున వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి కుటుంబ సభ్యులే పోటీచేయాలని నిర్ణయించేసుకున్నారట! అయితే, ప్రత్యేకించి.. వివేకా హత్య కేసులో ఎవరి పాత్ర అయితే ఉందని సునీత ఆరోపిస్తూ వస్తున్నారో అదే అవినాష్‌రెడ్డిపై ఎన్నికల్లో ఎదురొడ్డి నిలవాలన్నది షర్మిల భావన. అందుకే కడప లోక్‌సభ నియోజకవర్గం నుంచి సునీతను కానీ, ఆమె తల్లి, వివేకానందరెడ్డి భార్య సౌభాగ్యమ్మను కానీ పోటీ చేయించాలని అనుకుంటున్నారట!