CM Jagan : 21న అల్లూరి జిల్లా పర్యటనకు సీఎం జగన్
సీఎం వైఎస్ జగన్ ఎల్లుండి(21వ తేదీ) అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి పర్యటనకు వెళ్లనున్నారు.

CM Jagan visited Alluri district on 21st
సీఎం వైఎస్ జగన్(CM YS Jagan) ఎల్లుండి(21వ తేదీ) అల్లూరి సీతారామరాజు జిల్లా(Alluri Sitaramaraju District) చింతపల్లి(Chinthapalli) పర్యటనకు వెళ్లనున్నారు. పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి 8వ తరగతి విద్యార్ధులకు ఉచితంగా ట్యాబ్(Tabs)లు అందజేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఈ మేరకు సీఎంవో అధికారులు పర్యటన షెడ్యూల్‌ను విడుదల చేశారు.
21వ తేదీ ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి చింతపల్లి మండలం చౌడుపల్లి చేరుకుంటారు. అక్కడి నుంచి చింతపల్లి చేరుకుని గిరిజన సంక్షేమ శాఖ బాలుర ఆశ్రమ పాఠశాల విద్యార్ధులతో మాట్లాడిన అనంతరం ట్యాబ్‌లు అందజేయనున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. కార్యక్రమం అనంతరం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
