CM Jagan Tour To Vizag : రేపు సీఎం జగన్ విశాఖ పర్యటన
సీఎం జగన్(CM Jagan) రేపు విశాఖపట్నం పర్యటనకు వెళ్లనున్నారు. పర్యటనలో భాగంగా విశాఖలో వివిధ అభివృద్ది పనులకు శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ మేరకు సీఎంవో అధికారులు ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి విశాఖ చేరుకుంటారు.

CM Jagan Tour To Vizag
సీఎం జగన్(CM Jagan) రేపు విశాఖపట్నం పర్యటనకు వెళ్లనున్నారు. పర్యటనలో భాగంగా విశాఖలో వివిధ అభివృద్ది పనులకు శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ మేరకు సీఎంవో అధికారులు ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి విశాఖ చేరుకుంటారు. ముందుగా కైలాసపురం పోర్టు ఆసుపత్రి సమీపంలో ఇనార్బిట్ మాల్ నిర్మాణానికి భూమి పూజ చేస్తారు. అనంతరం హై–టీలో పాల్గొంటారు. అదే ప్రాంగణంలో జీవీఎంసీకి చెందిన 50 అభివృద్ది పనులకు శంకుస్ధాపన చేస్తారు.
ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి సిరిపురంలోని ఏయూ క్యాంపస్‌కు చేరుకుంటారు. ఎలిమెంట్ ఫార్మా ఇంక్యుబేషన్ సెంటర్, బయో మానిటరింగ్ హబ్‌తో సహా ఐదు ప్రాజెక్టులకు సంబంధించిన భవనాలను లాంఛనంగా సీఎం ప్రారంభిస్తారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి బీచ్ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్‌కు చేరుకుంటారు. అక్కడ ఆంధ్ర యూనివర్శిటీ విద్యార్ధులతో సీఎం ఇంటరాక్ట్ అవుతారు. కార్యక్రమం తర్వాత అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
