CM Jagan : కుర్రాడి సరదా తీర్చిన సీఎం జగన్
ముఖ్యమంత్రి జగన్ శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. పర్యటనలో భాగంగా రూ. 700 కోట్లతో నిర్మించిన వైఎస్సార్ సుజలధార ప్రాజెక్టు, 85 కోట్లతో కిడ్నీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి

CM Jagan took a selfie with the boy
ముఖ్యమంత్రి జగన్(CM Jagan) శ్రీకాకుళం(Srikakulam) జిల్లా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. పర్యటనలో భాగంగా రూ. 700 కోట్లతో నిర్మించిన వైఎస్సార్ సుజలధార ప్రాజెక్టు, 85 కోట్లతో కిడ్నీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి(Kidney Super Speciality Hospital), కిడ్నీ రీసెర్చ్ సెంటర్(Kidney Research Center)లకు ప్రారంభించిన విషయం తెలిసిందే. అనంతరం పలాస(Palasa)లో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. సభా ప్రాంగణంలో ముఖ్యమంత్రితో సెల్ఫీ(Selfie) దిగాలని పలాసకు చెందిన ఏడో తరగతి విద్యార్ధి టి. దిలీప్(Dileep) బారికేడ్లపై ఎక్కగా.. . వెంటనే సెక్యూరిటీ సిబ్బంది ఆ విద్యార్థిని వారించారు. అది గమనించిన సీఎం జగన్.. అలాంటి ప్రమాదకర ప్రయత్నం చేయవద్దని దిలీప్‌కు చెబుతూనే.. అతడితో సెల్ఫీ దిగి ఆత్మీయంగా హత్తుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా(Social Media)లో వైరల్ అయ్యాయి.
