CM Jagan : ఎల్లుండి సీఎం జగన్ రెండు జిల్లాల పర్యటన
సీఎం వైఎస్ జగన్(CM jagan) ఎల్లుండి(30వ తేదీ) నంద్యాల, వైఎస్సార్(YSRCP) జిల్లాల పర్యటనకు వెళ్లనున్నారు. ముందుగా పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్.. నంద్యాల(Nandyala) జిల్లాలో అవుకు రెండవ టన్నెల్‌ను జాతికి అంకితం చేయనున్నారు. అనంతరం కడప(Kadapa) పెద్దదర్గా(Pedda Darga) ప్రధాన ఉరుసు ఉత్సవాలలో పాల్గొంటారు. ఈ మేరకు సీఎంవో అధికారులు పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేశారు
సీఎం వైఎస్ జగన్(CM jagan) ఎల్లుండి(30వ తేదీ) నంద్యాల, వైఎస్సార్(YSRCP) జిల్లాల పర్యటనకు వెళ్లనున్నారు. ముందుగా పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్.. నంద్యాల(Nandyala) జిల్లాలో అవుకు రెండవ టన్నెల్‌ను జాతికి అంకితం చేయనున్నారు. అనంతరం కడప(Kadapa) పెద్దదర్గా(Pedda Dargah) ప్రధాన ఉరుసు ఉత్సవాలలో పాల్గొంటారు. ఈ మేరకు సీఎంవో అధికారులు పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేశారు.
30వ తేదీ ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి నంద్యాల జిల్లా అవుకు మండలం మెట్టుపల్లి చేరుకుంటారు. అక్కడి నుంచి అవుకు(OWK) రెండవ టన్నెల్ సైట్‌కు చేరుకుని నీటిని విడుదల చేసి రెండవ టన్నెల్‌ను జాతికి అంకితం చేయనున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ పరిశీలన అనంతరం పైలాన్‌ను ఆవిష్కరించనున్నారు. అనంతరం అక్కడి నుంచి కడప చేరుకుని పెద్దదర్గా ప్రధాన ఉరుసు ఉత్సవాలలో పాల్గొంటారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.