ఎన్నికల షెడ్యూల్(ELection schedule) విడుదలైన మరుక్షణం నుంచే ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల(AP Elections) వేడి మొదలయ్యింది. పార్టీలన్నీ ఎన్నికల సమరాంగణం కోసం సంసిద్ధమవుతున్నాయి. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి(CM Jagan) ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు.
ఎన్నికల షెడ్యూల్(ELection schedule) విడుదలైన మరుక్షణం నుంచే ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల(AP Elections) వేడి మొదలయ్యింది. పార్టీలన్నీ ఎన్నికల సమరాంగణం కోసం సంసిద్ధమవుతున్నాయి. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి(CM Jagan) ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ఈ నెల 27వ తేదీ నుంచి మేమంతా సిద్ధం పేరుతో మొదటి విడత ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారని సమాచారం. రాయలసీమ నుంచే జగన్ యాత్రను ప్రారంభిస్తారని పార్టీ వర్గాలు అంటున్నాయి. బస్సు యాత్ర(Bus Yatra) ప్రారంభానికి ముందు ముఖ్యమంత్రి జగన్ ఇడుపులపాయలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఘాట్‌ను సందర్శిస్తారు. అక్కడి నుంచే బస్సు యాత్రను మొదలుపెడతారు. పులివెందుల, కమలాపురం నియోజకవర్గాల మీదుగా జగన్ ప్రొద్దుటూరుకు చేరుకుంటారు. ప్రొద్దుటూరులోనే తొలి బహిరంగ సభ జరుగుతుంది. మరుసటి రోజు అంటే 28వ తేదీన నంద్యాల, 29వ తేదీన కర్నూలు, 30వ తేదీన హిందూపురం పార్లమెంటరీ స్థానాల పరిధిలో బస్సు యాత్ర కొనసాగుతుంది. అలాగే సిద్దం సభలు జరిగిన చోట్ల బహిరంగ సభలు ఉండవని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పూర్తి రూట్ మ్యాప్, జగన్ ఎన్నికల ప్రచారం షెడ్యూల్‌ను మంగళవారం సాయంత్రం విడుదల చేస్తారు. బస్సు యాత్ర ప్రకటన రావడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం వచ్చింది.