RK Roja : ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా మంత్రి రోజా?
అధికార వైసీపీ(YCP) ఒంగోలు ఎంపీగా(Ongole MP) మంత్రి ఆర్‌కే రోజాను(RK Roja) రంగంలోకి దించాలని చూస్తోంది. ఆ మేరకు ప్రకాశం జిల్లా నాయకులకు ఆ పార్టీ నేత విజయసాయిరెడ్డి(Vijay sai reddy) సమాచారం ఇచ్చారు. సీఎం జగన్ కాదన్నా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డితో వైసీపీ నాయకులు మంతనాలు
జరుపుతున్న నేపథ్యంలో అధిష్ఠానం రోజా పేరు ప్రతిపాదించడం విశేషం.
అధికార వైసీపీ(YCP) ఒంగోలు ఎంపీగా(Ongole MP) మంత్రి ఆర్‌కే రోజాను(RK Roja) రంగంలోకి దించాలని చూస్తోంది. ఆ మేరకు ప్రకాశం జిల్లా నాయకులకు ఆ పార్టీ నేత విజయసాయిరెడ్డి(Vijay sai reddy) సమాచారం ఇచ్చారు. సీఎం జగన్ కాదన్నా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డితో వైసీపీ నాయకులు మంతనాలు
జరుపుతున్న నేపథ్యంలో అధిష్ఠానం రోజా పేరు ప్రతిపాదించడం విశేషం. తాను పెట్టిన షరతులకు అంగీకరించని ఎంపీ మాగుంటకు తిరిగి టికెట్ ఇచ్చేది లేదని జగన్ తేల్చిచెప్పిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కూడా మాగుంటకు టికెట్ ఇప్పించేందుకు మాజీ మంత్రి బాలినేని ప్రయత్నించి విఫలమయ్యా రు. ఆ తర్వాత చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి(Chevireddy Bhaskar Reddy) పేరును ఒంగోలు ఎంపీ స్థానానికి అధిష్ఠానం ప్రతిపాదించింది. అయితే బాలినేనితో(Balineni) సహా జిల్లాలోని నాయకులు అందరూ చెవిరెడ్డిని వ్యతిరేకించారు. ‘తండ్రీకొడుకులు ఇద్దరికీ టికెట్లు ఇచ్చే విధానం లేదన్నారు కదా..! చెవిరెడ్డికి ఎలా ఇస్తారు? అలాగైతే నా కుమారుడు ప్రణీత్‌రెడ్డి కూడా పోటీకి సిద్ధంగా ఉన్నా డు’ అని విజయసాయి, సజ్జలతో బాలినేని అన్నట్లు సమాచారం. మరోవైపు శుక్రవారం ఒంగోలులో మాగుంటతో మరోసారి బాలినేని, దర్శి ఇన్‌చార్జి బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి భేటీ అయ్యారు.
లోక్‌సభ పరిధిలోని(Lok sabha) అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేయబోతున్న నాయకులు సీఎంను కలవాలి. ఎంపీ మాగుంటకు టికెట్ ఇచ్చే విషయాన్ని పరిశీలించాలని కోరాలి’ అన్న ఆలోచన చేశారు. అయితే ఆ బృందానికి ఎవరు నాయకత్వం వహించాలన్న విషయం దగ్గరే మీమాంస ఏర్పడింది. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి శనివారం బాలినేని, మంత్రి సురేశ్‌తోపాటు మరో ఇద్దరు, ముగ్గురు నాయకులతో మాట్లాడారని తెలిసింది. ఒంగోలు ఎంపీ అభర్థిగా రోజా పేరు పరిశీలనలో ఉంది. ఒకటి, రెండు రోజుల్లో ఖరారు కావచ్చని విజయసాయిరెడ్డి చెప్పినట్లు సమాచారం. అయితే ఈ వార్తలను రోజు ఖండించారు. తాను ఎంపీగా పోటీ చేయడంలేదని ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో నగరి నుంచే పోటీ చేస్తానని ఆమె తెలిపారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన నగరి ప్రజలకు రుణపడి ఉంటానన్నారు. నగరిని విడిచి పెట్టి వెళ్లేది లేదని తెలిపారు. నగరి నియోజకవర్గం తనకు పుట్టినిల్లులాంటిదని మంత్రి రోజా తెలిపారు. జీవితాంతం నగరి నియోజకవర్గానికి సేవ చేస్తానని.. వచ్చే ఎన్నికల్లో నగరి నుంచి పోటీ చేసి హ్యాట్రిక్ కోట్టబోతున్నాని మీడియాకు రోజా తెలిపారు.