వచ్చే ఎన్నికల్లో గెలుపే ఏకైక లక్ష్యంగా అభ్యర్థులను మార్చేస్తున్న వైసీపీ(YCP) అధిష్టానం..కొన్ని నియోజకవర్గాల్లో గ్రౌండ్ రియాల్టీని(Ground Reality) తెలుసుకునేందుకు మరోసారి సర్వే చేయించాలని భావిస్తున్నట్టు సమాచారం. ఐప్యాక్(IPack) ద్వారా సర్వే(Survey) చేయించి మార్పులు చేపట్టాలని నిర్ణయించినట్టు పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది. ఇప్పటికే విడుదలైన నాలుగు లిస్టుల్లో అభ్యర్థుల మార్పులు చేర్పులు చేసిన వైసీపీ అధిష్టానం..ఐదో జాబితాను సిద్ధం చేస్తోంది

వచ్చే ఎన్నికల్లో గెలుపే ఏకైక లక్ష్యంగా అభ్యర్థులను మార్చేస్తున్న వైసీపీ(YCP) అధిష్టానం..కొన్ని నియోజకవర్గాల్లో గ్రౌండ్ రియాల్టీని(Ground Reality) తెలుసుకునేందుకు మరోసారి సర్వే చేయించాలని భావిస్తున్నట్టు సమాచారం. ఐప్యాక్(IPack) ద్వారా సర్వే(Survey) చేయించి మార్పులు చేపట్టాలని నిర్ణయించినట్టు పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది. ఇప్పటికే విడుదలైన నాలుగు లిస్టుల్లో అభ్యర్థుల మార్పులు చేర్పులు చేసిన వైసీపీ అధిష్టానం..ఐదో జాబితాను సిద్ధం చేస్తోంది. రేపోమాపో ఐదో జాబితా విడుదలకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది.

మరో నెల రోజుల్లో ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్(AP Election Notification) వెలువడే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే ప్రజల్లో సానుకూలతలేని అభ్యర్థులను మార్చేస్తోంది వైసీపీ అధిష్టానం. సీఎం జగన్(CM Jagan) తీసుకున్న ఈ నిర్ణయం సిట్టింగ్ అభ్యర్థులు జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీ సొంతంగా నిర్వహించిన సర్వేల్లో సానుకూలతలేని అభ్యర్థులను నిర్మోహమాటంగా మార్చేస్తున్నారు సీఎం జగన్. దీంతో సీటు కోల్పోయిన సిట్టింగ్ లు తీవ్ర అసంతృప్తి రగిలిపోతున్నారు. కొందరు పార్టీ వీడి వెళ్లిపోతున్నారు. ఆయా జిల్లాల్లో టిక్కెట్ దక్కని, నియోజకవర్గాలు మారిన నేతలు ప్రస్తుతానికి గుంభనంగా కనిపిస్తున్నారు. వీరిలో కొందరు టీడీపీ, జనసేనవైపు చూపుతున్నారు.

దీని వల్ల పార్టీ విజయావకాశాలకు గండిపడే ప్రమాదం ఉందని గ్రహించిన సీఎం జగన్..కొన్ని నియోజకవర్గాల్లో రీసర్వే చేయించాలని భావిస్తున్నారు. ప్రధానంగా ఉమ్మడి నెల్లూరు(Nellure), ప్రకాశం(Prakasham), గుంటూరు(Gunure), కృష్ణా(Krishna), ఉభయగోదావరిజిల్లాలో ఐప్యాక్ ద్వారా మరోసారి సర్వే చేయించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఉమ్మడి కృష్ణాజిల్లాలో మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ఇప్పటికే రాజీనామా చేశారు. పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారిధి టీడీపీలో చేరుతున్నారు. వసంత కృష్ణప్రసాద్ తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. నరసరావుపేట ఎంపీ కృష్ణదేవరాయలు రాజీనామాతో ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఉభయగోదవారి జిల్లాలో టీడీపీ-జనసేన కూటమి అభ్యర్థులెవరనేది తేలేదాకా ఇంఛార్జీల మార్పులు ఉంటాయని తెలుస్తోంది. అయితే.. ఇప్పటి వరకు చేపట్టిన మార్పులు, చేర్పుల వల్ల ఏఏ నియోజకవర్గాల్లో నష్టం వాటిల్లుతుందనే అంశాలపై మరోసారి సర్వే చేయించి, పార్టీలో తలెత్తిన ఆందోళనలన్నింటికీ ఫుల్ స్టాప్ పెట్టాలని అధిస్టానం భావిస్తున్నట్టు పార్టీ వర్గాల సమాచారం.

Updated On 25 Jan 2024 1:21 AM GMT
Ehatv

Ehatv

Next Story