✕
CM Jagan : రేపు తిరుపతిలో ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్.. పాల్గొననున్న సీఎం జగన్
By YagnikPublished on 22 Jan 2024 9:25 PM GMT
రేపు సీఎం వైఎస్ జగన్ తిరుపతి పర్యటనకు వెళ్లనున్నారు. పర్యటనలో భాగంగా ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్‌లో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు.

x
CM Jagan to participate in India Today Education Summit
రేపు సీఎం వైఎస్ జగన్(CM Jagan) తిరుపతి(Tirupathi) పర్యటనకు వెళ్లనున్నారు. పర్యటనలో భాగంగా ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్(India Today Education Summit)లో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. ఈ మేరకు సీఎంవో అధికారులు పర్యటన షెడ్యూల్‌ను విడుదల చేశారు. మధ్యాహ్నం 2.45 గంటలకు తాడేపల్లి(Thadepalli) నివాసం నుంచి బయలుదేరి తిరుపతి చేరుకుంటారు. అక్కడ తాజ్ హోటల్(Taj Hotel)లో జరిగే ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్‌లో పాల్గొంటారు. అనంతరం బయలుదేరి రాత్రికి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

Yagnik
Next Story