ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh) ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ(YSRCP) అధినేత జగన్మోహన్‌ రెడ్డి(Jagan Mohan Reddy) ఎన్నికలకు(Election) సంసిద్ధమవుతున్నారు. ఇప్పటికే సిట్టింగ్‌ ఎమ్మెల్యేల విషయంలో భారీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. విజయవాడ పరిధిలో కూడా కొన్ని కీలక మార్పులు చేపట్టబోతున్నారు. విజయవాడ మేయర్‌(Mayor) రాయన భాగ్యలక్ష్మికి(Rayana Bhagya Lakshmi) ఈసారి ఎమ్మెల్యే టికెట్‌(MLA Ticket) ఇవ్వబోతున్నారని తెలుస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh) ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ(YSRCP) అధినేత జగన్మోహన్‌ రెడ్డి(Jagan Mohan Reddy) ఎన్నికలకు(Election) సంసిద్ధమవుతున్నారు. ఇప్పటికే సిట్టింగ్‌ ఎమ్మెల్యేల విషయంలో భారీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. విజయవాడ పరిధిలో కూడా కొన్ని కీలక మార్పులు చేపట్టబోతున్నారు. విజయవాడ మేయర్‌(Mayor) రాయన భాగ్యలక్ష్మికి(Rayana Bhagya Lakshmi) ఈసారి ఎమ్మెల్యే టికెట్‌(MLA Ticket) ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. విజయవాడ(Vijayawada) పశ్చిమ నుంచి ఆమెను పోటీ చేయించాలన్నది జగన్‌ ఆలోచన! ప్రస్తుతం ఆ నియోజకవర్గానికి వెల్లంపల్లి శ్రీనివాస్‌(Vellampalli Srinivas) ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నియోజకవర్గంలో ఈయనపై తీవ్ర వ్యతిరేకత ఉందని సర్వేలో తేలింది. అందుకే కొత్త అభ్యర్థిని బరిలో దింపాలని జగన్‌ అనుకుంటున్నారు. విజయవాడ మేయర్‌ భాగ్యలక్ష్మిని పోటీ చేయిస్తే గెలిచే అవకాశాలు ఎక్కువవుతాయని భావిస్తున్నారు. బీసీ సామాజికవర్గానికి చెందిన భాగ్యలక్ష్మికి మంచి పేరు ఉంది. విజయవాడ మేయర్‌గా ఆమె చక్కటి పనితీరును కనబరుస్తున్నారు. విజయవాడ నగరాన్ని కాలుష్య రహితంగా తీర్చిదిద్దారన్న మంచి పేరును భాగ్యలక్ష్మి దక్కించుకున్నారు. భాగ్య‌ల‌క్ష్మి భర్త న‌రేంద్ర‌కుమార్‌ బిజినెస్‌మన్‌! ఆయనకు కూడా విజయవాడ పశ్చిమలో మంచి సంబంధాలున్నాయి. వ్యాపార వర్గాలలో పట్టుంది. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ను మరో చోట అకామిడేట్ చేసి భాగ్యలక్ష్మికి ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వాలన్న నిర్ణయానికి జగన్‌ వచ్చేశారట!

Updated On 14 Dec 2023 2:01 AM GMT
Ehatv

Ehatv

Next Story