ఏపీలో(AP) వైసీపీ(YCP) వచ్చే ఎన్నికలపై పూర్తి ఫోకస్ పెట్టిందా? సాధ్యమైనంత తొందరగా అభ్యర్థులను ప్రకటించి జనంలోకి పంపించాలని యోచిస్తోందా? ఒక్కొక్క జిల్లాలో వైసీపీ అభ్యర్థుల వడపోత కార్యక్రమం కొనసాగుతుందా? వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలను పెద్ద ఎత్తున మార్చబోతున్నారా? తాజా పరిణామాలను చూస్తే అవుననే సమాధానం వస్తోంది. మరోవైపు ఏపీలో ముందస్తు ఎన్నికలు(Early Elections) రాబోతున్నాయన్న ప్రచారమూ ఊపందుకుంది.

ఏపీలో(AP) వైసీపీ(YCP) వచ్చే ఎన్నికలపై పూర్తి ఫోకస్ పెట్టిందా? సాధ్యమైనంత తొందరగా అభ్యర్థులను ప్రకటించి జనంలోకి పంపించాలని యోచిస్తోందా? ఒక్కొక్క జిల్లాలో వైసీపీ అభ్యర్థుల వడపోత కార్యక్రమం కొనసాగుతుందా? వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలను పెద్ద ఎత్తున మార్చబోతున్నారా? తాజా పరిణామాలను చూస్తే అవుననే సమాధానం వస్తోంది. మరోవైపు ఏపీలో ముందస్తు ఎన్నికలు(Early Elections) రాబోతున్నాయన్న ప్రచారమూ ఊపందుకుంది.

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసిపి సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో(Sitting MLA) గుబులు మొదలైంది. వచ్చే ఎన్నికల్లో పెద్ద ఎత్తున సిట్టింగ్‎లను మార్చాలని సీఎం జగన్మోహన్ రెడ్డి(Jagan Mohan Reddy) యోచిస్తుండటంతో ఎమ్మెల్యేల్లో టెన్షన్ మొదలైంది. పల్నాడు జిల్లాలో ఏకంగా మంత్రిగా కొనసాగుతున్న విడుదల రజిని గుంటూరు పశ్చిమ‎కు మారుస్తూ కొత్త అభ్యర్థి రాజేష్ నాయుడును(Rajesh Nayudu) తెరపైకి తెచ్చారు. దీంతో ఆ పార్టీలో కలకలం మొదలైంది. సీనియర్లను పక్కనపెట్టి అనూహ్యంగా రాజేష్ నాయుడు పేరు తెరపైకి రావడం చర్చనీయాంశంగా మారింది.

రాజకీయ చైతన్యం ఉన్న చిలకలూరిపేట, గుంటూరులలో కుల సమీకరణలకు వైసీపీ పెద్దపీట వేయడం కలిసి వస్తుందా..? లేదా అన్నది వేచి చూడాలి. ఇప్పటికే అసమ్మతి ఎదుర్కొంటున్న నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి(Gopireddy Srinivas Reddy), వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు(Amabati Rambabu) స్థానాల్లోనూ మార్పులు ఉంటాయని ప్రత్యర్ధులు ప్రచారం చేస్తున్నారు. జగన్ కు అత్యంత సన్నిహితుడు ఆళ్ల రామకృష్ణారెడ్డినే పక్కన పెడితే పీకే సర్వేలలో వెనుకబడిన సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వేటు తప్పదని భావిస్తున్నారు.

ఇప్పటికే కాసు మహేష్ రెడ్డి నరసరావుపేట సీటును ఆశిస్తుండగా శ్రీనివాస్‎రెడ్డికి వ్యతిరేకంగా గజ్జల బ్రహ్మారెడ్డి(Gajjala Bramha Reddy) అసమ్మతి కార్యక్రమాలకు తెరతీస్తున్నారు. గురజాలలో కూడా బీసీ కార్డును ప్రయోగించి జంగాకు మరోసారి అవకాశం ఇస్తారని కూడా ప్రచారం జరుగుతుంది. వినుకొండలో నన్నపనేని సుధా, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జున రావు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. అంబటి రాంబాబుకు వ్యతిరేకంగా రెడ్డి సామాజిక వర్గం కొత్త అభ్యర్థిని రంగంలోకి దించాలని కోరుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో జగన్ సంచలన నిర్ణయాలు పల్నాడుకు తాకుతుందని ఆ పార్టీలో పెద్ద చర్చగా మారింది.

ఇక గాజువాక ఇంఛార్జి మార్పుతో ఉత్తరాంధ్ర వైసీపీలోనూ టెన్షన్ మొదలైంది. ఇక్కడ కూడా పెద్ద ఎత్తున మార్పులు ఉంటాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అరకు, పాడేరు, అనకాపల్లి, పాయకరావుపేటలో మార్పులు చేస్తారనే చర్చ జరుగుతోంది. అరకులో ఎంపీ మాధవి, పసుపులేటి బాలాజీ పేర్లు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఇచ్ఛాపురం, పాతపట్నం, ఎచ్చెర్ల, చోడవరంపైనా వైసీపీ కసరత్తు చేస్తోంది. పాడేరుకు విశ్వేశ్వర్‎రాజును నియమించే అవకాశం ఉంది. అనకాపల్లికి బుడేటి సత్యవతి లేదా దాడి రత్నాకర్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. అనకాపల్లి ఎమ్మెల్యే మంత్రి అమర్‎నాథ్‎ను ఎంపీ బరిలో దించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఇచ్ఛాపురం ఇంఛార్జీగా బీసీకి ఇచ్చే అవకాశం ఉంది. పాతపట్నంలో రెడ్డిశాంతిని మార్చుతారంటూ ప్రచారం జరుగుతోంది. ఎచ్చెర్లలో చిన్న శ్రీను, బెల్లం చంద్రశేఖర్ పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. చోడవరంలో కూడా కొత్త ఇంఛార్జీ నియమకానికి కసరత్తు జరుగుతోంది. అలాగే పాయకరావుపేట సిట్టింగ్ ఎమ్మెల్యే బాబూరావును మార్చే అవకాశం ఉంది.

తెలంగాణ ఎన్నికల్లో సిట్టింగ్ లపై ఉన్న వ్యతిరేకత వల్లే బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయిందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రజల్లో సానుకూలత లేని సిట్టింగ్ లను మార్చాలని సీఎం జగన్మోహన్‎రెడ్డి నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే వై నాట్ 175 అనే స్లోగన్ అందుకున్న వైసీపీ నేతలు..ఆ దిశగానే పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నారని సమాచారం.

Updated On 12 Dec 2023 2:59 AM GMT
Ehatv

Ehatv

Next Story