వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాలని భావిస్తున్న వైఎస్సార్సీపీ(YSRCP) ఎలాంటి మేనిఫెస్టోను(Manifesto) ప్రకటిస్తుందనే ఆసక్తి అందరిలోనూ ఉంది. ఒకవైపు అసెంబ్లీ, లోక్‎సభ అభ్యర్థులను సిద్ధం చేస్తున్న వైసీపీ..మరోవైపు ప్రజల్లోకి వెళ్లేందుకు మ్యానిఫెస్టోపై కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. గత ఎన్నికలో వైసీపీ 26 అంశాలతో కూడిన మ్యానిఫెస్టోను తీసుకొచ్చింది. దాదాపు 99.5 శాతం హామీలను తమ ప్రభుత్వం నెరవేర్చిందని ఇటీవల సీఎం జగన్(CM Jagan) చెప్పుకొచ్చారు.

వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాలని భావిస్తున్న వైఎస్సార్సీపీ(YSRCP) ఎలాంటి మేనిఫెస్టోను(Manifesto) ప్రకటిస్తుందనే ఆసక్తి అందరిలోనూ ఉంది. ఒకవైపు అసెంబ్లీ, లోక్‎సభ అభ్యర్థులను సిద్ధం చేస్తున్న వైసీపీ..మరోవైపు ప్రజల్లోకి వెళ్లేందుకు మ్యానిఫెస్టోపై కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. గత ఎన్నికలో వైసీపీ 26 అంశాలతో కూడిన మ్యానిఫెస్టోను తీసుకొచ్చింది. దాదాపు 99.5 శాతం హామీలను తమ ప్రభుత్వం నెరవేర్చిందని ఇటీవల సీఎం జగన్(CM Jagan) చెప్పుకొచ్చారు. గత ఎన్నికల్లో 129 హామీలు ఇస్తే అందులో 111 నెరవేర్చినట్లు వైసీపీ ఇప్పటికే ప్రకటించింది. మరో 12 హామీలు వివిధ దశల్లో ఉన్నాయి. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల కంటే మరో 45 హామీలను అదనంగా అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు సంక్షేమ పథకాల అమలుకు తడిసిమోపడుతోంది. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా సకాలంలో చెల్లించలేని పరిస్థితి ఉంది. రోడ్లు, పరిశ్రమలు, ఇరిగ్రేషన్ ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాల కల్పనపై దష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. వీటన్నింటినీ దష్టిలో పెట్టుకుని ఈసారి మ్యానిఫెస్టోను రూపొందిస్తున్నట్లు సమాచారం. ఈసారి బడ్జెట్‎పై అదనపు భారంపడే కొత్త సంక్షేమ పథకాల ప్రకటన ఉండబోదని పార్టీ వర్గాలు చెబుతున్నమాట. 2019 మ్యానిఫెస్టోను కొనసాగించడంతోపాటు రెండో..మూడో కొత్త ప్రకటనలు ఉండవచ్చన్నది పార్టీ నేతలు భావిస్తున్నారు. ఉద్యోగ వర్గాలకు మరింత లబ్ది కలిగేలా కొత్త ప్రకటన చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. కనీసం లక్ష, లేదా లక్షన్నర వరకైనా వ్యవసాయ రుణమాఫీ చేస్తే బాగుటుందని కొందరు నేతలు అధిష్టానానికి సూచించినట్టు తెలుస్తోంది. అలాగే..తెలంగాణ, కర్నాటకలో విజయవంతమైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాన్నిమ్యానిఫెస్టో కమిటీ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి..త్వరలోనే అధికార వైసీపీ మ్యానిఫెస్టోపై స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.

Updated On 1 Feb 2024 4:43 AM GMT
Ehatv

Ehatv

Next Story