ప్రొద్దుటూరు సభలో సీఎం జగన్ మోహన్ రెడ్డి కాస్త ఎమోషనల్ గా కనిపించారు. చాలా రోజులుగా వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి పలువురు నేతలు వైసీపీని టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే.

ప్రొద్దుటూరు సభలో సీఎం జగన్ మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) కాస్త ఎమోషనల్ గా కనిపించారు. చాలా రోజులుగా వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి పలువురు నేతలు వైసీపీYCP)ని టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. వైఎస్ సునీత, వైఎస్ షర్మిల కూడా వివేకానంద రెడ్డిని హత్య చేసిన వ్యక్తికి మద్దతుగా ఉన్నారంటూ సీఎం జగన్ ఆరోపణలు గుప్పించారు. ఈ విషయంపై ఇన్నాళ్లూ మాట్లాడకుండా ఉన్న సీఎం జగన్ మేమంతా సిద్ధం యాత్రలో భాగంగా ప్రొద్దుటూరు బహిరంగ సభలో కీలక వ్యాఖ్యలు చేశారు.

వైఎస్ సునీత, వైఎస్ షర్మిల కూడా వివేకానంద రెడ్డిని హత్య చేసిన వ్యక్తికి మద్దతుగా ఉన్నారంటూ సీఎం జగన్ ఆరోపణలు గుప్పించారు. తన వాళ్లనే చంద్రబాబు తన మీద ఉసిగొల్పుతున్నారన్నారని అన్నారు సీఎం జగన్. వివేకా చిన్నాన్నను అన్యాయంగా అతిదారుణంగా చంపారు.. ఆ హంతకులెవరో ఆ దేవుడికి, ఈ జిల్లా ప్రజలకు తెలుసన్నారు. చంపిన హంతకులు బహిరంగంగా తిరుగుతున్నారు. ఆ హంతకుడికి మద్దతు ఎవరిస్తున్నారో అంతా చూస్తున్నారు.. ఆ చంపినోడు ఉండాల్సింది జైల్లో. కానీ, నేరుగా నెత్తిన పెట్టుకుని మద్దతు ఇస్తోంది చంద్రబాబు, చంద్రబాబుకి సంబంధించిన యెల్లో మీడియా అన్నారు సీఎం జగన్. ఇంతటి దారుణం చేసి.. నన్ను దెబ్బ తీయాలనుకుంటున్నారు. ఇంత కన్నా అన్యాయం ఉంటుందా? అని అన్నారు. నాపై బురద జల్లుతూ రాజకీయం చేస్తున్నారు. చంద్రబాబు, దత్తపుత్రుడు, బీజేపీ, కాంగ్రెస్ నా పై యుద్ధానికి వస్తున్నారు. ఇది చాలదన్నట్లు నా ఇద్దరు చెల్లెల్ని తీసుకొస్తున్నారన్నారు. కానీ, నేను ధర్మాన్ని, న్యాయాన్ని నమ్ముకున్నా.. నాకు ప్రజల అండ, దేవుడి దయ ఉన్నాయని సీఎం జగన్ చెప్పుకొచ్చారు.

Updated On 27 March 2024 9:01 AM GMT
Yagnik

Yagnik

Next Story