ఏ రాజకీయపార్టీకైనా మేనిఫెస్టో అన్నది ఓ భగవద్గీత లాంటిది. ఓ ఖురాన్‌ లాంటిది. ఓ బైబిల్‌ లాంటిది. గురుగ్రంథ్‌ సాహిబ్‌ లాంటిది. ఎన్నికలప్పుడు అధికారంలోకి వస్తే ఏం చేస్తామన్నది ప్రజలకు విపులంగా చెప్పడానికి మేనిఫెస్టోను(Manifesto) రూపొందించుకుంటాయి పార్టీలు! అందులో ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చి తీరాలి. అసాధ్యమనుకున్నప్పుడు మేనిఫెస్టోలో పెట్టనే కూడదు! కొన్ని పొలిటికల్‌ పార్టీలేమో అధికారంలోకి రావడం కోసం అలవికానీ హామీలన్నీ ఇచ్చేస్తుంటాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని మర్చిపోతుంటాయి. 2014 ఎన్నికల సందర్భంగా తెలుగుదేశంపార్టీ(TDP) అధినేత నారా చంద్రబాబునాయుడు(Nara Chandrababu) అతి పెద్ద ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు.

ఏ రాజకీయపార్టీకైనా మేనిఫెస్టో అన్నది ఓ భగవద్గీత లాంటిది. ఓ ఖురాన్‌ లాంటిది. ఓ బైబిల్‌ లాంటిది. గురుగ్రంథ్‌ సాహిబ్‌ లాంటిది. ఎన్నికలప్పుడు అధికారంలోకి వస్తే ఏం చేస్తామన్నది ప్రజలకు విపులంగా చెప్పడానికి మేనిఫెస్టోను(Manifesto) రూపొందించుకుంటాయి పార్టీలు! అందులో ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చి తీరాలి. అసాధ్యమనుకున్నప్పుడు మేనిఫెస్టోలో పెట్టనే కూడదు! కొన్ని పొలిటికల్‌ పార్టీలేమో అధికారంలోకి రావడం కోసం అలవికానీ హామీలన్నీ ఇచ్చేస్తుంటాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని మర్చిపోతుంటాయి. 2014 ఎన్నికల సందర్భంగా తెలుగుదేశంపార్టీ(TDP) అధినేత నారా చంద్రబాబునాయుడు(Nara Chandrababu) అతి పెద్ద ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఆ మేనిఫెస్టోపై జగన్మోహన్‌రెడ్డి ఓ ఆట ఆడుకున్నారు. ఓ విధంగా చంద్రబాబును ర్యాగింగ్‌ చేశారు. ఎన్నికల సమయంలో ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చే పార్టీలను విమర్శించారు జగన్‌. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను మర్చిపోయి తమ ఇష్టం వచ్చినట్టుగా పాలించిన పార్టీలపై మేమంతా సిద్ధం సభలో జగన్‌ ఆటాడుకున్నారు. పదేళ్ల కిందట చంద్రబాబు రూపొందించిన మేనిఫెస్టోలో కులాలు, వర్గాలు, వృత్తులు, మహిళలు, ఇలాప్రతి ఒక్కరికీ ఏదో ఒక హామీ ఇచ్చారు. ఆయన మాటలు నమ్మేసి జనం ఓటేసి గెలిపించారు. కొన్నాళ్లకే మేనిఫెస్టోను పూర్తిగా మర్చిపోయారు చంద్రబాబు. అంతకు ముందు టీడీపీ అధికారిక వెబ్‌సైట్‌లో మేనిఫెస్టో పీడీఎఫ్‌ కాపీన ప్రజలకు డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి వీలుగా అందుబాటులో ఉండేది. అధికారంలోకి రాగానే దానిని వెబ్‌సైట్‌లోంచి తొలగించారు. అందుకు కారణమేమిటంటే మేనిఫెస్టోని హామీలను తుంగలో తొక్కడమే! వెబ్ సైట్ నుంచి కూడా మేనిఫెస్టోను మాయం చేసిన మాయలఫకీరు చంద్రబాబునాయుడు అని మేమంతా సిద్ధం సభలో జగన్‌(CM Jagan) వ్యాఖ్యానించారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దాన పత్రం మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేయడంలో చంద్రబాబు సిద్ధహస్తుడని విమర్శించారు జగన్‌. ప్రజలను మోసం చేయడానికి రంగురంగుల్లో మేనిఫెస్టోను ముద్రిస్తారని, పచ్చ మీడియాలో ప్రకటనలు కూడా ఇస్తారని, కానీ అవన్నీ మోసాలేనని జగన్ అన్నారు. అదే సమయంలో మేనిఫెస్టోలో ప్రకటించిన వాటిలో 99 శాతం పనులను పూర్తిచేసిన ఘనత వైఎస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీది అని గర్వంగా చెప్పుకున్నారు. మేనిఫెస్టో లేనివి కూడా అనేకం అమలు చేశామని చెప్పారు. మేనిఫెస్టో అనే పేరుతో వందలాది అబద్ధాలను అందంగా వండి వార్చి, ప్రజలను ఏమార్చి, తర్వాత వాటిని మర్చిపోయిన చంద్రబాబు విధానాన్ని జగన్‌ సభలో ఎండగట్టారు.

Updated On 28 March 2024 1:55 AM GMT
Ehatv

Ehatv

Next Story