నాలుగేళ్లకు ఓ పెళ్లి చేసుకునే పవన్ కళ్యాణ్(Pawan kalyan).. వాలంటీర్ల(Volunteer) క్యారెక్టర్ల గురించి మాట్లాడుతున్నాడని సీఎం జగన్(CM Jagan) అన్నారు. తిరుప‌తి వెంక‌ట‌గిరిలో వైఎస్సాఆర్ నేత‌న్న నేస్తం కార్య‌క్ర‌మం సంద‌ర్భంగా జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో ఆయ‌న మాట్లాడుతూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మందు తాగుతూ అమ్మాయిలతో స్విమ్మింగ్ పూల్ లో డాన్సులు చేసేవాడు ఒకడు..

నాలుగేళ్లకు ఓ పెళ్లి చేసుకునే పవన్ కళ్యాణ్(Pawan kalyan).. వాలంటీర్ల(Volunteer) క్యారెక్టర్ల గురించి మాట్లాడుతున్నాడని సీఎం జగన్(CM Jagan) అన్నారు. తిరుప‌తి వెంక‌ట‌గిరిలో వైఎస్సాఆర్ నేత‌న్న నేస్తం కార్య‌క్ర‌మం సంద‌ర్భంగా జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో ఆయ‌న మాట్లాడుతూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మందు తాగుతూ అమ్మాయిలతో స్విమ్మింగ్ పూల్ లో డాన్సులు చేసేవాడు ఒకడు.. అమ్మాయిలు కనిపిస్తే కడుపు చేయాలని చెప్పేవాడు మరొకడు.. చేసిన తప్పులను గొప్పగా చెప్పుకునే ముసలాయన ఒకరు.. క్యారెక్టర్ లేని వాళ్లంతా వాలంటీర్ల గురించి మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు.

వాలంటీర్ల పై తప్పుడు మాటల స్క్రిప్ట్ రామోజీరావుదని అన్నారు. చంద్రబాబు(Chnadhra babu), ఈనాడు(Enadu), ఆంధ్రజ్యోతి(andhrajyothy), టీవీ 5(TV5) అంతా గజదొంగల మూట అని అన్నారు. వాలంటీర్ల స్క్రిప్ట్ కు నిర్మాత చంద్రబాబు అయితే.. నటన మాటలన్నీ దత్తపుత్రుడివేనన్నారు. పదేళ్లుగా చంద్రబాబుకు ప్యాకేజీ స్టార్ పవన్ కళ్యాణ్ వాలంటీర్ గా పనిచేస్తున్నారని అన్నారు. వాలంటీర్లు అందరూ స్నేహభావంతో పని చేస్తున్నారని అన్నారు. మంచి చేస్తున్న వ్యవస్థలను కొంతమంది విమర్శిస్తున్నారని అన్నారు. సంస్కారం ఉన్న ఏ ఒక్కరూ వాలంటీర్ల‌ను అవమానించరన్నారు. వాలంటీర్లు ఎవరో కొత్తవారు కాదని.. అంతా మీకు తెలిసిన వాళ్లేనని స్ప‌ష్టం చేశారు. ఎండా, వాన‌ లెక్క చేయకుండా ప్రజలకు వాలంటీర్లు సేవ చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ప్రతి గడపకు సంక్షేమాన్ని అందిస్తున్నారని పేర్కొన్నారు.

Updated On 21 July 2023 2:10 AM GMT
Ehatv

Ehatv

Next Story