అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఘాట్‌ రోడ్డులో ఆర్టీసీ బస్సు ప్రమాద ఘటనపై సీఎం జగన్‌ దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. ప్ర‌మాద ఘ‌ట‌న‌పై అల్లూరి జిల్లా, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లా కలెక్టర్లకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.

అల్లూరి సీతారామరాజు జిల్లా(Alluri Sitaramaraju District) పాడేరు ఘాట్‌ రోడ్డు(Paderu Ghat Road)లో ఆర్టీసీ బస్సు ప్రమాద(Bus Accident) ఘటనపై సీఎం జగన్‌(CM Jagan) దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. ప్ర‌మాద ఘ‌ట‌న‌పై అల్లూరి జిల్లా, అనకాపల్లి(Anakapalli), విశాఖపట్నం(Vishakapatnam) జిల్లా కలెక్టర్లకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. క్షతగాత్రులకు మంచి ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆయా జిల్లాల పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించారు. బాధిత కుటుంబాలకు తోడుగా నిలవాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఘటనకు దారితీసిన కారణాలపై అధికారులు దృష్టిసారించాలన్నారు.

అల్లూరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జ‌రిగింది. పాడేరు ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి 100 అడుగుల‌ లోయలో పడిపోయింది. మోదమాంబ పాదాలకు మూడు కిమీ దూరంలో ప్రమాదం సంభవించింది. ఈ ప్ర‌మాదంలో ఇద్ద‌రు మృతిచెందగా.. ప‌లువురికి గాయాల‌య్యాయి. చెట్టు కొమ్మను తప్పించబోయిన డ్రైవ‌ర్‌.. బస్సుపై నియంత్ర‌ణ కోల్ఓవ‌డంతో ఒక్కసారిగా అదుపుతప్పి లోయలోకి పడిపోయిన‌ట్లు తెలుస్తోంది.

Updated On 20 Aug 2023 9:34 AM GMT
Yagnik

Yagnik

Next Story