Breaking News : కేబినెట్ నిర్ణయం.. విజయదశమి నుంచి విశాఖలో పాలన
సీఎం జగన్(CM Jagan) అధ్యక్షతన ఏపీ కేబినెట్(AP Cabinet Meeting) భేటీ జరుగుతుంది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా.. విశాఖను పరిపాలనా రాజధానిగా గతంలో ప్రకటించిన ఏపీ ప్రభుత్వం..
సీఎం జగన్(CM Jagan) అధ్యక్షతన ఏపీ కేబినెట్(AP Cabinet Meeting) భేటీ జరుగుతుంది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా.. విశాఖను పరిపాలనా రాజధానిగా గతంలో ప్రకటించిన ఏపీ ప్రభుత్వం.. ఇందుకు విజయ దశమిని ముహూర్తంగా ఖరారు చేసింది. దసరా నుంచి విశాఖపట్నం నుంచి పాలన మొదలవుతుందని కేబినెట్ తీర్మానించింది. ఇందులో భాగంగానే విశాఖలో(Vishakapatanam) కార్యాలయాల ఎంపికపై కమిటీని నియమించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. కమిటీ సూచనలు మేరకు కార్యలయాల ఏర్పాటు ఉంటుందని సమాచారం.
ఇదిలావుంటే.. విశాఖపట్నంలో ఇప్పటికే అక్కడ సీఎం నివాసం సహా పలు నిర్మాణాలు జరుగుతున్నాయి. రాజధాని తరలింపుపై ప్రస్తుతం క్షేత్రస్థాయిలో.. కోర్టుల్లో కొన్ని వివాదాలున్నా.. ప్రభుత్వం వెనక్కి తగ్గకుండా నిర్ణయాన్ని అమలు చేస్తుండటం గమనార్హం. కాగా కేబినెట్ భేటీలో ముందస్తు, జమిలీ ఎన్నికలపై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తుంది. కేంద్రం నిర్ణయం మేరకు ఎన్నికలపై ముందుకు వెళ్లాలని నిర్ణయించినట్లు సమాచారం.