రాష్ట్రంలో కౌలు రైతులకు(Tenant farmers) రైతుభరోసా నిధులు(Raithu Bharosa Funds) నేడు విడుదల అయ్యాయి. తాడేపల్లిలోని(Tadepalli) సీఎం కార్యాలయం నుంచి సీఎం వర్చువల్‌గా బటన్‌ నొక్కి నిధుల్ని జమ చేశారు. రాష్ట్రంలోని 1,46,324 మంది కౌలు రైతులకు రూ.109.74 కోట్లు జమ చేసినట్లు సీఎం జగన్(CM jagan) పేర్కొన్నారు.

రాష్ట్రంలో కౌలు రైతులకు(Tenant farmers) రైతుభరోసా నిధులు(Raithu Bharosa Funds) నేడు విడుదల అయ్యాయి. తాడేపల్లిలోని(Tadepalli) సీఎం కార్యాలయం నుంచి సీఎం వర్చువల్‌గా బటన్‌ నొక్కి నిధుల్ని జమ చేశారు. రాష్ట్రంలోని 1,46,324 మంది కౌలు రైతులకు రూ.109.74 కోట్లు జమ చేసినట్లు సీఎం జగన్(CM jagan) పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కౌలు రైతులకు తోడుగా నిలబడే ప్రభుత్వం బహుశా ఎక్కడా లేదేమమోనని, దేశంలోనే తొలిసారిగా కౌలు రైతులతో పాటు దేవదాయ, అటవీ భూములను సాగు చేస్తున్న వాస్తవ సాగుదారులకు కూడా వైఎస్సార్‌ రైతు భరోసా పథకాన్ని వర్తింపచేస్తోందని అని సీఎం తెలిపారు.

పంట హక్కు సాగు పత్రాలు పొందిన వారిలో అర్హులైన.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలుదారులు, అలాగే.. దేవదాయ భూము­లను సాగు చేస్తున్న రైతులకు ఒక్కొక్కరికి రూ.7,500 చొప్పున సాయం పంపిణీ చేస్తోందని చెప్పారు. 2023–24 సీజన్‌కు సంబంధించి తొలి విడత పెట్టుబడి సాయం ఇదని రైతులకు సాయం చేయటం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో భూ యజమానులకు వైయస్ఆర్‌ రైతు భరోసా కింద ఏటా.. రూ.13,500 చొప్పున పెట్టు­బడి సాయాన్ని అందిస్తోందని, మే నెలలో రూ.7,500, అక్టోబర్‌లో రూ.4 వేలు, జనవరిలో రూ.2 వేలు చొప్పున మూడు విడతల్లో ఈ సాయాన్ని జమ చేస్తోందని రైతన్నలు బాగుండాలనే ఈ పథకం చేపట్టినట్లు సీఎం వివరించారు.

ఇప్పటివరకు 5,38,227 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలుదారులు, 3,99,321 మంది అటవీ భూమి సాగుదారులకు నేటితో మొత్తం రూ.1,122.85 కోట్ల పెట్టుబడి సాయం అందించామని తెలిపారు. మొత్తంగా అందరికీ కలిపి ఇప్పటి వరకు రైతుభరోసా పథకం ద్వారా 52.57 లక్షల రైతు కుటుంబాలకు రూ.31,005.04 కోట్ల మేర పెట్టుబడి సాయాన్ని అందించామని సీఎం జ‌గ‌న్‌ పేర్కొన్నారు.

Updated On 1 Sep 2023 4:01 AM GMT
Ehatv

Ehatv

Next Story