YSR Congress Party : కూటమి నేతలలో బీపీ, వైసీపీ నేతలు హ్యాపీ
ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) పొలిటికల్ హీట్ బాగా పెరిగింది. ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రధాన రాజకీయపార్టీలు ప్రచారంలో మునిగితేలుతున్నాయి. సభలు, సమావేశాలు, రోడ్డు షోలతో బీజీ అయ్యాయి. ఇక అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్(YSR congress) పార్టీని ఎలాగైనా సరే గద్దె దింపాలన్న లక్ష్యంతో టీడీపీ(TDP)-జనసేన(Janasena)-బీజేపీ(BJP) కూటమి కట్టాయి. మూడు పార్టీలు కలిస్తే జగన్‌ను ఓడించడం పెద్ద కష్టమైన పని కాదని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు(Chandrababu) భావించారు.
ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) పొలిటికల్ హీట్ బాగా పెరిగింది. ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రధాన రాజకీయపార్టీలు ప్రచారంలో మునిగితేలుతున్నాయి. సభలు, సమావేశాలు, రోడ్డు షోలతో బీజీ అయ్యాయి. ఇక అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్(YSR congress) పార్టీని ఎలాగైనా సరే గద్దె దింపాలన్న లక్ష్యంతో టీడీపీ(TDP)-జనసేన(Janasena)-బీజేపీ(BJP) కూటమి కట్టాయి. మూడు పార్టీలు కలిస్తే జగన్‌ను ఓడించడం పెద్ద కష్టమైన పని కాదని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు(Chandrababu) భావించారు. ప్రధాని మోదీ(PM Modi) ఇమేజ్ ఎంతో కొంత ఉపయోగపడుతుందని అనుకున్నారు. బీజేపీ పొత్తు కోసం వెంపర్లాడారు. మొత్తంమీద బీజేపీతో పొత్తు కుదుర్చుకోవడంలో సక్సెసయ్యారు. దాంతో ఏపీలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మూడు పార్టీల క్యాడర్ అసంతృప్తితో రగిలిపోతున్నది. తెలుగుదేశం పార్టీ బలహీనపడిందని, ఇలాంటి సమయంలో రాష్ట్ర బాగు కోసం ఆ పార్టీకి చేయూతనివ్వక తప్పదని స్వయంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. అంటే టీడీపీ కంటే జనసేన బలంగా ఉందని చెప్పకనే చెప్పారు. జనసేన కార్యకర్తలు కూడా ఇదే భావనతో ఉన్నారు. కానీ పొత్తు తర్వాత జరిగిందేమిటి? జనసేనను బలమైన పార్టీగా గుర్తించడానికి టీడీపీ అహం అడ్డువచ్చింది. అందుకే 24 అసెంబ్లీ స్థానాలను, మూడు లోక్‌సభ స్థానాలను ఆ పార్టీకి ఇచ్చి సర్దుకోమని చెప్పింది. దాంతో జనసైనికులలో ఆక్రోశం కట్టలు తెంచుకుంది. జగన్‌ను టీడీపీ ఒంటరిగా ఎదుర్కోవడం కష్టమని, తాము లేకపోతే టీడీపీ విజయం సాధించడం అసాధ్యమని, అలాంటి తమకు ముష్టి వేసినట్టు 24 సీట్లు ఇవ్వడమేమిటని జనసేన కార్యకర్తలు కోపంతో ఊగిపోయారు. ఇలా వారు ఆగ్రహంతో ఊగిపోతున్న సమయంలోనే అసెంబ్లీ సీట్ల సంఖ్యతో కోత పెట్టింది టీడీపీ. 24 స్థానాలు కాస్త 21 అయ్యాయి. లోక్‌సభ స్థానాల్లో కూడా ఒకటి తగ్గించి, మీకు రెండు సరిపోతాయని చెప్పింది. దాంతో జనసేన కార్యకర్తల్లో అసహనం మొదలయ్యింది. ఇప్పుడు రెండు పార్టీల మధ్య ఓట్లు బదిలీ అవుతాయన్న నమ్మకం సన్నగిల్లింది. మధ్యలో బీజేపీ వచ్చి చేరింది. జనసేనలా కాకుండా బీజేపీ డిమాండ్ చేసి మరీ సీట్లు సంపాదించుకుంది. కూటమిలో లుకలుకలు కూడా మొదలయ్యాయి. కూటమి ముందు ఏమో కానీ, కూటమి తర్వాత మాత్రం జగన్‌కు అనుకూల వాతావరణం ఏర్పడిందని అంటున్నారు.