CM Jagan : సీఎం జగన్ పామర్రు పర్యటన వాయిదా
సీఎం వైఎస్ జగన్ కృష్ణా జిల్లా పామర్రు పర్యటన వాయిదా పడింది. 29వ తేదీన సీఎం జగన్ పామర్రు పర్యటనకు వెళ్లాల్సివుండగా

CM Jagan Pamarru visit postponed
సీఎం వైఎస్ జగన్(CM Jagan) కృష్ణా జిల్లా(Krishna District) పామర్రు(Pamarru) పర్యటన వాయిదా పడింది. 29వ తేదీన సీఎం జగన్ పామర్రు పర్యటనకు వెళ్లాల్సివుండగా అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. ఈ మేరకు సీఎంవో అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.
పామర్రు పర్యటనలో భాగంగా జగనన్న విద్యా దీవెన(Jagananna Vidya Deevena) నగదును బటన్ నొక్కి విద్యార్ధుల తల్లుల ఖాతాలో జమచేసిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొనేవారు. అయితే అనూహ్యంగా ఈ కార్యక్రమం వాయిదా పడింది. అయితే.. త్వరలో మరో తేదీని షెడ్యూల్ చేస్తారా.. లేదా.. వర్చువల్‌గా విద్యార్ధుల ఖాతాల్లోకి నగదు బదిలీ చేస్తారా అనేది తెలియాల్సివుంది.
