ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. వర్షాలు కొంత తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం తుఫాన్ బలహీనపడి అల్పపీడనంగా మారింది. తుఫాన్ వ‌ల్ల‌ వర్షాలు విస్తృతంగా పడ్డాయి. కలెక్టర్లు, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు స్పెషల్‌ ఆఫీసర్లుగా క్షేత్రస్థాయిలో చాలా బాగా పనిచేశారని కితాబిచ్చారు. బాధితులకు సకాలంలోసాయం అందించాలన్నారు.

మిచాంగ్ తుఫాన్(Minchaug Typhoon) ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన రైతులు అధైర్యపడొద్దని, అండగా ఉంటామని సీఎం జ‌గ‌న్‌(CM Jagan) హామీ ఇచ్చారు. బుధవారం తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో తుఫాన్ ప్రభావం, చేపడుతున్న సహాయచర్యలపై అధికారులు సీఎంకు వివరించారు.

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. వర్షాలు కొంత తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం తుఫాన్ బలహీనపడి అల్పపీడనంగా మారింది. తుఫాన్ వ‌ల్ల‌ వర్షాలు విస్తృతంగా పడ్డాయి. కలెక్టర్లు, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు స్పెషల్‌ ఆఫీసర్లుగా క్షేత్రస్థాయిలో చాలా బాగా పనిచేశారని కితాబిచ్చారు. బాధితులకు సకాలంలోసాయం అందించాలన్నారు. పది రూపాయలు ఎక్కువ ఖర్చు అయినా బాధితులకు మంచి సహాయం అందాలన్నారు. బాధితులకు చేసే సాయంలో లోటు రాకూడదన్నారు. వర్షాల వల్ల ఇళ్లు దెబ్బతిన్న వారికి రూ.10వేలు ఇవ్వాలి. క్యాంపుల నుంచి తిరిగి ఇళ్లకు వెళ్తున్న సందర్భంలోనూ వారికి అవసరం అయిన సాయం చేయాలని ఆదేశించారు. పంటపొలాల్లో ఉన్న వరదనీటిని పూర్తిగా తొలగించడంపై దృష్టి పెట్టాలని సీఎం జగన్ తెలిపారు.

పంటల రక్షణ, పంటలకు పరిహారం అందించడం, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడం దగ్గర నుంచి అన్ని రకాలుగా రైతులకు అండగా ఉండాలన్నారు. 80 శాతం సబ్సిడీపై విత్తనాల సరఫరాకూ అన్ని రకాలుగా సిద్ధం కావాలన్నారు. యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపట్టండి. యుద్ధ ప్రాతిపదికన విద్యుత్‌ను పునరుద్ధరించాలి. రోడ్లు దెబ్బతిన్న ప్రాంతాల్లో రవాణా పునరుద్ధరణకు వెంటనే చర్యలు తీసుకోవాలి. వర్షాలు తగ్గుముఖం పట్టిన ప్రాంతాల్లో వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్యంపై దృష్టిసారించండి. అధికారులంతా బాగానే పనిచేస్తున్నారు. మేమందరం మీకు తోడుగా ఉన్నాం. ఒక్క ఫోన్‌ కాల్‌ దూరంలో ఉన్నాం. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొండి. దురదృష్టవశాత్తూ విధి నిర్వహణలో ఉండగా చెట్టుకూలి కానిస్టేబుల్‌ చనిపోయాడు. ఆ కుటుంబాన్ని కూడా ప్రభుత్వం ఆదుకుంటుంది. ఆ కుటుంబానికి రూ.30 లక్షలు సాయం అందిస్తామని సీఎం జగన్‌ భరోసా ఇచ్చారు.

గ్రామాల్లో ఉన్న వాలంటీర్‌ దగ్గర నుంచి, సచివాలయ సిబ్బంది మొదలుకుని, ప్రభుత్వంలో పై స్ధాయిలో ఉన్న ఉద్యోగి వరకు ఎలాంటి ఇబ్బంది జరిగినా ప్రభుత్వం అన్ని రకాలుగా తోడుగా ఉంటుంది. వారిలో ఆత్మస్థైర్యాన్ని నిలబెట్టేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సీఎం స్పష్టం చేశారు. వర్షాల వల్ల ఇళ్లు దెబ్బతిన్న వారికి రూ.10వేలు ఇచ్చే విషయంలోనూ, వర్షాలు కారణంగా ముంపునకు గురైన లోతట్టు ప్రాంతాల వారిని క్యాంపులకు తీసుకొచ్చి వారిని చూసుకునే విషయంలోనూ, క్యాంపుల నుంచి తిరిగి ఇళ్లకు వెళ్లున్న సందర్భంలోనూ వారికి ఇవ్వాల్సిన సహాయం వారికి ఇవ్వాలి. రేషన్‌ పంపిణీలో కూడా ఎలాంటి లోపం ఉండకూడదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు.

పంటపొలాల్లో ఉన్న వరదనీటిని పూర్తిగా తొలగించడంపై దృష్టి పెట్టాలి. అన్ని రకాల మానవ వనరులను దీనిపై పెట్టండి. ధ్యాసంతా ఇక్కడే పెట్టాలి. ఇది అత్యంత ప్రాధాన్య అంశం. పంటల సంరక్షణకు ప్రతి ఆర్బీకే పరిధిలోనూ ఎస్‌ఓపీ ఇప్పటికే జారీ చేశారన్నారు. రైతులకు కచ్చితమైన భరోసా ఇవ్వండి. ప్రభుత్వం ప్రతి రైతుకు అండగా నిలబడుతుంది. వారు అధైర్య పడాల్సిన పనిలేదు. పంటల రక్షణ, పంటలకు పరిహారం అందించడం, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడం దగ్గర నుంచి అన్ని రకాలుగా రైతుకు ప్రతి అడుగులోనూ తోడుగా ప్రభుత్వం ఉంటుంది. 80శాతం సబ్సిడీపై విత్తనాల సరఫరాకూ అన్ని రకాలుగా సిద్ధం కావాలని కోరారు.

Updated On 6 Dec 2023 6:34 AM GMT
Ehatv

Ehatv

Next Story