అధికార వైసీపీకి(YCP) అచ్చిరాని నర్సాపురం(Narsapuram) పార్లమెంట్‌ నియోజకవర్గం. ఇక్కడి ఎంపీ వైసీపీ నుంచే గెలిచినా.. పార్టీకి చాలా కాలంగా రఘురామకృష్ణంరాజు(Raghuramakrishnam Raja) దూరంగా ఉంటున్నాడు. టీడీపీకి(TDP) రఘురామకృష్ణంరాజు దగ్గరయ్యాడు. సీఎం జగన్‌ను(CM Jagan) విమర్శిస్తూ వస్తున్నాడు. సొంత పార్టీ వైఖరిని తప్పుపడుతూ వచ్చాడు.

అధికార వైసీపీకి(YCP) అచ్చిరాని నర్సాపురం(Narsapuram) పార్లమెంట్‌ నియోజకవర్గం. ఇక్కడి ఎంపీ వైసీపీ నుంచే గెలిచినా.. పార్టీకి చాలా కాలంగా రఘురామకృష్ణంరాజు(Raghuramakrishnam Raja) దూరంగా ఉంటున్నాడు. టీడీపీకి(TDP) రఘురామకృష్ణంరాజు దగ్గరయ్యాడు. సీఎం జగన్‌ను(CM Jagan) విమర్శిస్తూ వస్తున్నాడు. సొంత పార్టీ వైఖరిని తప్పుపడుతూ వచ్చాడు. సీఎం జగన్‌పై, వైసీపీపై తీవ్ర ఆరోపణలు చేస్తూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలో నర్సాపురం స్థానంపై వైసీపీ నజర్‌ పెట్టింది.

వచ్చే ఏడాది జరగనున్న ఏపీ ఎన్నికల్లో(AP assembly Elections) ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకోబుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
నర్సాపురం ఎంపీ అభ్యర్థిగా అనూహ్యంగా దివంగత సినీనటుడు కృష్ణంరాజు(Krishnam Raju) భార్య శ్యామలాదేవి(Shyamala Devi) పేరు తెరపైకి వచ్చింది. ఈ మేరకు వైసీపీ నేతలు శ్యామలాదేవికి ప్రతిపాదనలు కూడా పంపించారట. ఇప్పటికిప్పుడు శ్యామలాదేవి తన నిర్ణయాన్ని చెప్పకపోయినప్పటికీ.. మున్ముందు ఈ ప్రతిపాదనలు అంగీకరించే అవకాశం ఉందని వైసీపీ భావిస్తోంది.

నటుడిగా కృష్ణంరాజుకు మంచి పేరు వచ్చింది. అందులోనూ క్షత్రియ(Kshatriya) సామాజిక వర్గానికి చెందిన కృష్ణంరాజు భార్య శ్యామలాదేవిని ఈ సారి బరిలోకి దించాలని వైసీపీ ఆలోచిస్తోంది. నియోజకవర్గంలో క్షత్రియ ఓటు బ్యాంకు కూడా బలంగా ఉండడం కూడా... వైసీపీ ఈ నిర్ణయానికి కారణమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన రఘురామకృష్ణంరాజు కూడా క్షత్రియడే. నియోజకవర్గంలో 25శాతానికిపైగా క్షత్రియుల ఓట్లు ఉన్నాయి. నరసాపురం లోక్‌సభ స్థానంలో ఏ పార్టీనుంచైనా క్షత్రియ సామాజిక వర్గం నేతలే పోటీచేస్తుంటారు. ఎక్కువసార్లు క్షత్రియులే గెలుస్తూ వస్తున్నారు. ముఖ్యంగా ప్రభాస్‌(Prabhas) సినిమా విడుదలైనప్పుడు క్షత్రియుల హంగామా చేస్తారు. ఈ నేపథ్యంలోనే బలమైన క్షత్రియ సామాజికవర్గానికి చెందిన శ్యామలాదేవిని దించాలని వైసీపీ వ్యూహరచన చేస్తోంది.

గతంలో దివంగత కృష్ణంరాజు కూడా నర్సాపురం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1999 ఎన్నికల్లో పోటీ చేసి లక్షా 65 వేల ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. అప్పటి వాజ్‌పేయి(Vajpayee) కేబినెట్‌లో రక్షణశాఖ సహాయమంత్రిగా పనిచేశారు. 2004లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన హరిరామజోగయ్య చేతిలో కృష్ణంరాజు పరాజయం పొందారు. గతంలో కృష్ణంరాజు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం కావడం వల్ల శ్యామలాదేవి కూడా ఇందుకు అంగీకరిస్తారని వైసీపీ విశ్వసిస్తోంది. వైసీపీ అభ్యర్థిగా శ్యామలాదేవి పేరు ఖరారైతే ప్రభాస్‌ కూడా ప్రచారంలో పాల్గొంటారని వైసీపీ అంచనాలు వేస్తోంది. వైసీపీ నుంచి శ్యామలాదేవి పోటీ చేస్తే ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో తమకు అనుకూల వాతావరణం ఏర్పడుతుందని వైసీపీ భావిస్తోందట.

Updated On 2 Nov 2023 5:15 AM GMT
Ehatv

Ehatv

Next Story