Kodi Kathi Case : కోడి కత్తి కేసు విచారణ.. సీఎం జగన్ కోర్టుకు హాజరు కావాలంటూ..
విశాఖపట్నం(Vishakapatanam) ఎన్ఐఏ కోర్టులో(NIA) కోడి కత్తి కేసు విచారణ జరిగింది. ఈ నేపథ్యంలోనే రాజమహేంద్రవరం(Rajamahendravaram) జైలు నుంచి నిందితుడు శ్రీనును(Srinu) విశాఖకు తరలించారు. నిందితుడు శ్రీను కుటుంబసభ్యులు కూడా కోర్టుకు చేరుకున్నారు. ఇప్పటివరకూ విజయవాడ ఎన్ఐఏ కోర్టులో జరిగిన విచారణ..
విశాఖపట్నం(Vishakapatanam) ఎన్ఐఏ కోర్టులో(NIA) కోడి కత్తి కేసు విచారణ జరిగింది. ఈ నేపథ్యంలోనే రాజమహేంద్రవరం(Rajamahendravaram) జైలు నుంచి నిందితుడు శ్రీనును(Srinu) విశాఖకు తరలించారు. నిందితుడు శ్రీను కుటుంబసభ్యులు కూడా కోర్టుకు చేరుకున్నారు. ఇప్పటివరకూ విజయవాడ ఎన్ఐఏ కోర్టులో జరిగిన విచారణ.. నేడు విశాఖలో జరిగింది. నిందితుడు శ్రీను తరఫు న్యాయవాది సలీం(Advocate Saleem) వాదనలు వినిపించారు. కోర్టుకు సీఎం జగన్(CM Jagan) హాజరుకావాలని లేదా నిందితుడు శ్రీనుకు బెయిల్ అయినా ఇవ్వాలని వాదనలు వినిపించారు. సీఎం జగన్ తరపున న్యాయవాది వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు.
జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు.. 2018 అక్టోబర్ 25న విశాఖ ఎయిర్ పోర్టులో ఘటన జరిగింది. ఐదేళ్ల నుంచి కోడి కత్తి కేసు విచారణ కొనసాగుతుంది. నేటికీ నిందితుడు శ్రీనుకు బెయిల్ మంజూరు కాలేదు. కేసులో కుట్ర కోణం లేదని ఎన్ఐఏ ఇప్పటికే తేల్చింది. జగన్ ఎన్ఓసీ అయినా ఇవ్వాలి.. వచ్చి వాదనలైనా వినిపించాలి.. రాజకీయాల కోసమే కేసును వాయిదా వేస్తున్నట్లున్నారు.. వచ్చే ఎన్నికల్లో మళ్లీ ఈ అంశాన్ని వాడుకోవాలని చూస్తున్నారేమోనని నిందితుడు శ్రీను తరపు న్యాయవాది సలీం వాదనలు వినిపించారు. వాదనలు విన్న ధర్మాసనం.. కేసును సెప్టెంబర్ 6వ తేదీకి వాయిదా వేసింది. సీఎం జగన్ తరపు న్యాయవాది కూడా వీడియో కాల్ ద్వారా విచారణకు హాజరవుతానని పిటీషన్ దాఖలు చేయడం కొసమెరుపు.