వైఎస్సార్‌సీపీ ఎన్నికల శంఖారావ సభ ‘సిద్ధం’లో పాల్గొనన్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. మధ్యాహ్నం 2.40 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి సీఎం బయలుదేరి వెళ్లనున్నారు.

CM Jagan Mohan Reddy participates in ‘Siddham’ of YSRCP election Shankharava Sabha
వైఎస్సార్‌సీపీ(YSRCP) ఎన్నికల శంఖారావ సభ ‘సిద్ధం’లో పాల్గొనన్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి(CM Jagan). మధ్యాహ్నం 2.40 గంటలకు తాడేపల్లి(THadepalli) నివాసం నుంచి సీఎం బయలుదేరి వెళ్లనున్నారు. ఏలూరు(Eluru)లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి “సిద్ధం” సభ.. షెడ్యూల్ ఒకసారి పరిశీలిస్తే.. ఇవాళ మధ్యాహ్నం 3:20నిమిషాలకి దెందులూలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకోనున్నారు సీఎం జగన్. 3:30కి సభా ప్రాంగణం కు చేరుకోనున్న సీఎం జగన్… 3:30నుంచి 4:45 వరకు ప్రసంగిస్తారు. ఇవాళ సాయంత్రం 5 గంటలకు తాడేపల్లికి తిరుగు ప్రయాణం అవుతారు. ఈ సభ కారణంగా దెందులూరులో సందడి వాతావరణం నెలకొంది.
ఈ సభ కోసం భారీ ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా(Krishna) జిల్లా నుంచి లక్షలాది మంది క్యాడర్ ఈ సభకు హాజరు కానున్నారు. 50నియోజక వర్గాల నుండి పార్టీ శ్రేణులు రానున్నాయి. సభా వేదిక ముందు ఫ్యాన్(FAn) గుర్తు ఆకారంలో వాకింగ్ వేను ఏర్పాటు చేశారు. 110 ఎకరాల ప్రాంగణంలో సిద్ధం బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. బందోబస్తు విధుల్లో 3,298 మంది పోలీసులు పాల్గొననున్నారు. 50 నియోజకవర్గాల ఇంచార్జ్‌లకు రూట్ మ్యాప్‌లో పోలీసులు తెలియజేశారు. ఏడు ప్రాంతాల్లో 150 ఎకరాల పార్కింగ్ స్థలాలు సిద్ధం చేశారు.
