వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, సీఎం వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ప్రస్తుతం

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, సీఎం వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ప్రస్తుతం సిద్ధం పేరుతో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఇక ఈ రోజు వైసీపీ కీలక సమావేశం జరగనుంది. అసెంబ్లీ ఎన్నికలకు ముఖ్యనేతలను సమాయత్తం చేసేందుకు వైసీపీ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన తాడేపల్లి సీకే కన్వెన్షన్‌లో ఈ మీటింగ్‌ జరగనుంది. ఉదయం 9.30 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది.. 175 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి నేతలు హాజరు కానున్నారు. సుమారు 2 వేలకు పైగా మండల స్థాయి నేతలు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సమావేశానికి మంత్రులు, పార్టీ జిల్లా అధ్యక్షులు, రీజనల్ కో ఆర్డినేటర్లకు పార్టీ ప్రతిష్టతపై గ్రౌండ్ లెవల్ లో తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేస్తారు. జిల్లాల్లో పార్టీ నేతల మధ్య విభేదాలు పరిష్కరించుకుని, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై కూడా సీఎం జగన్ మార్గనిర్దేశం చేయనున్నారు.

ఈ సమావేశంలో ప్రతి నియోజకవర్గంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి ఫలాలను ప్రజలకు వివరించాలని నేతలకు సూచనలు చేయనున్నారు సీఎం జగన్‌. గత ఐదేళ్లలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలే మరోసారి వైసీపీని అధికారంలోకి తీసుకువస్తాయని వైసీపీ భావిస్తోంది. ఇక ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలని నేతలకు సూచించనున్నట్లు తెలుస్తోంది.

Updated On 26 Feb 2024 9:54 PM GMT
Yagnik

Yagnik

Next Story